తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ssc Cgl 2024 : ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే

SSC CGL 2024 : ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే

Anand Sai HT Telugu

25 July 2024, 12:53 IST

google News
    • SSC CGL 2024 : ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పోస్టులకు అప్లై చేసుకునేవారికి శుభవార్త. స్టాప్ సెలక్షన్ కమిషన్ దరఖాస్తు గడువును పొడిగించింది.
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు (Unsplash)

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్ 2024) దరఖాస్తు గడువును స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పొడిగించింది. గతంలో పరీక్షకు దరఖాస్తు చేసుకోలేని వారు జూలై 27 (రాత్రి 11 గంటల్లోపు) ssc.gov.inలోగా తమ ఫారాలను సమర్పించవచ్చు.

ఎస్ఎస్సీ సీజీఎల్ 2024కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 24గా ఉండేది. అయితే తదితర కారణాలతో దరఖాస్తు చేసుకోలేని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు చెల్లింపు గడువును జూలై 25 నుంచి జూలై 28 వరకు పొడిగించారు.

ఎస్ఎస్‌సీ సీజీఎల్ 2024 ముఖ్యమైన తేదీలు

పొడిగించిన దరఖాస్తు తేదీ : జూన్ 24 నుంచి జూలై 27

ఫీజు చెల్లింపుకు చివరి తేదీ : జూలై 28

ఎడిట్ ఆప్షన్ : ఆగస్టు 10 నుండి 11

టైర్ 1 పరీక్ష సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో ఉండవచ్చు. టైర్ 2 పరీక్ష డిసెంబర్ నెలలో ఉండే అవకాశం ఉంది. అర్హత ప్రమాణాలు, వయోపరిమితి మరియు విద్యార్హతలు ప్రతి పోస్టుకు భిన్నంగా ఉంటాయి. అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసే ముందు పరీక్ష నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి. ఫారాలను సమర్పించడానికి అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. రిజర్వేషన్లకు అర్హులైన మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజును రద్దు చేశారు.

ఎస్ఎస్సీ సీజీఎల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో రెండంచెల కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో అర్హత సాధించిన తరువాత ఎంపికైన అభ్యర్థులను యూజర్ డిపార్ట్ మెంట్‌లు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తాయి.

కనీస అర్హత మార్కులు అన్ రిజర్వ్‌డ్ అభ్యర్థులకు 30 శాతం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు 25 శాతం, ఇతర అన్ని కేటగిరీలకు 20 శాతంగా ఉంది. పరీక్షలో అనుమతించిన గరిష్ట శాతం (కనీస అర్హత ప్రమాణాలు) అన్ రిజర్వ్ డ్ అభ్యర్థులకు 20 శాతం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25 శాతం, ఇతర అన్ని కేటగిరీలకు 30 శాతంగా నిర్ణయించారు.

తదుపరి వ్యాసం