జులై 23, నేటి రాశి ఫలాలు.. వీరికి మంచి సమయం నడుస్తోంది, పోటీ పరీక్షల్లో రాణిస్తారు-today horoscope july 23rd rasi phalalu in telugu check your zodiac signs results ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జులై 23, నేటి రాశి ఫలాలు.. వీరికి మంచి సమయం నడుస్తోంది, పోటీ పరీక్షల్లో రాణిస్తారు

జులై 23, నేటి రాశి ఫలాలు.. వీరికి మంచి సమయం నడుస్తోంది, పోటీ పరీక్షల్లో రాణిస్తారు

HT Telugu Desk HT Telugu
Jul 23, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ23.07.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జులై 23 నేటి రాశి ఫలాలు
జులై 23 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 23.07.2024

వారం: మంగ‌ళ‌వారం, తిథి : విదియ‌,

నక్షత్రం: ధ‌నిష్ట‌, మాసం : ఆషాఢ‌ము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేష రాశి

గ్రహసంచారం అనుకూలంగా ఉంది. చేప‌ట్టిన ప‌నుల‌ను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేస్తారు. గ‌త స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోండి. ఖర్చులు ఎక్కువైనా ప్రయోజనాలు మంచిగానే ఉంటాయి. ఆరోగ్యప‌రంగా మంచి మార్పులు చూడ‌గ‌ల‌రు.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారిని ఒత్తిడికి గురిచేసే విష‌యాలున్నాయి. కంగారు, అలజడి పెరుగుతాయి. చర్చలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా పరవాలేద‌నిపిస్తుంది. బదిలీలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారములు సాధారణంగా సాగుతాయి. కుటుంబ విషయాలు ఇతరులతో చర్చించకండి.

మిథున రాశి

అన్నింటా ఉత్సాహంగా సాగుతారు. సహోద్యోగులతో ఒకింత జాగ్రత్తలు తప్పనిసరి. సంకల్పం గట్టిగా ఉండేటట్లు చూసుకోవాలి. వస్తువుల విష‌యంలో జాగ్రత్తలు అవసరం. వృత్తి, వ్యాపారములలో సాధారణ స్థితులు కొనసాగుతాయి.

కర్కాటక రాశి

అష్టమ శనికై జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. ఆరోగ్యపరంగా జాగ్రత్త‌లు అవ‌స‌రం. ఖ‌ర్చులు నియంత్రించుకోండి. కుటుంబ‌స‌భ్యుల స‌హ‌కారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్య‌త‌లు పెరుగుతాయి. వ్యాపారం విష‌యంలో అనుభ‌వ‌జ్ఞుల స‌ల‌హాలు తీసుకోండి. ఒత్తిడికి దూరంగా ఉండండి.

సింహ రాశి

గ్రహసంచారాలు అనుకూలం. ప్రయత్నాలను వేగవంతం చేయండి. అవ‌స‌రాల‌కు స‌రిప‌డా ఆదాయం అందుతుంది. కొత్త వ్య‌క్తుల‌తో ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌తాయి. నిరుద్యోగులకు మంచి సమయం.

కన్యా రాశి

ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. పోరాటపటిమతో అనుకున్న‌ది సాధిస్తారు. అవ‌కాశాలు క‌లిసి వ‌స్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీదైన గుర్తింపు తెచ్చుకుంటారు. పాత స‌మ‌స్య‌లు ఒక కొలిక్కి వ‌స్తాయి.

తులా రాశి

ఆర్థిక,ఆరోగ్య విషయాల ప‌ట్ల‌ ముందు జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆప్యాయతలకై ఎదురుచూస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ తీరుపట్ల అసంతృప్తి క‌న‌బ‌రిచే సూచ‌న‌లు ఉన్నాయి.

వృశ్చిక రాశి

ఆరోగ్య, ఆర్థిక విషయాలపట్ల అవగాహనలుండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో సంయమనాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రయాణాలు అలసటకు గురిచేయు సూచనలున్నాయి. సంతానంలో ఒకరికి ఆదాయాలు ఏర్పడగలవు.

ధనుస్సు రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనుస్సు రాశి వారి జీవితం ఉత్సాహంగా సాగుతుంది. స‌హ‌కారం అందించేవారు ఉన్నారు. పనులలో పురోభివృద్ధిని చూడగలరు. అవకాశాలను వ‌దులుకోవ‌ద్దు. ఇతరుల నుంచి సాయం ఆశించ‌వ‌ద్దు. ఆర్థిక, ఆరోగ్య విషయాలు ఆశాజ‌నకంగా ఉంటాయి.

మకర రాశి

మంచి స‌మ‌యం నడుస్తోంది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. విమ‌ర్శ‌లు ధైర్యంగా ఎదుర్కొంటారు. పోటీ ప‌రీక్ష‌ల్లో రాణించ‌గ‌ల‌రు. ఒత్తిడి దరి చేర‌నివ్వ‌కండి. ఉద్యోగంలో కొత్త బాధ్య‌తలు చేప‌డ‌తారు. స్థ‌ల‌, గృహ మార్పుకు సంబంధించిన ఆలోచ‌న‌లు చేస్తారు.

కుంభ రాశి

అనారోగ్యం కారణంగా స్వ‌ల్ప‌ ఇబ్బందులు ఎదుర్కోవలసిరావచ్చు. అసౌకర్యాలచే గమ్యనిర్దేశములను మార్చుకుంటారు. అవివాహితులు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా స్వ‌ల్ప‌ ప్రయోజనాలు ఏర్పరచుకొంటారు. అధికారులతో గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండండి.

మీన రాశి

శారీరకంగా, మానసికంగా చికాకు ఉండగలదు. మనోధైర్యంతో వ్యవహరించుకోవాలి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఖర్చులలో నియంత్రణలు పాటించడం అవసరం. నిత్యకృత్యములను సకాలంలో జరిగేటట్లు చూడండి. ఉద్యోగాలలో బదిలీలు ఉంటాయి. కుటుంబీకుల స‌హాయ స‌హ‌కారాలు అందుతాయి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner