వీటిని తింటే ఒత్తిడి ఉఫ్‌మంటూ పోవడం ఖాయం

pixabay

By Haritha Chappa
Jul 22, 2024

Hindustan Times
Telugu

ఒత్తిడి వల్లే ఇప్పుడు ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. కొన్ని రకాల ఆహారాలు ప్రతిరోజూ తినడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. 

pixabay

బ్లూ బెర్రీలు ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించండి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

pixabay

డార్క్ చాక్లెట్‌ ముక్కను ప్రతి రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. ఇది ఒత్తిడి హార్మోను కార్టిసాల్ విడుదల కాకుండా అడ్డుకుంటుంది.

pixabay

పుల్లని పండ్లు అయిన నారింజ, బత్తాయి, ద్రాక్ష, కివీ,నిమ్మ రసం వంటివి తరచూ తింటూ ఉండాలి. 

pixabay

సాల్మన్ చేప మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. 

pixabay

అరటి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం వంటివి అధికంగా ఉంటాయి. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

pixabay

కోడిగుడ్లలో ట్రిఫ్టోఫాన్ ఉంటుంది. ఇది ఒక అమైనో ఆమ్లం. ఇది మనలో సెరటోనిన్, డోపమైన్ వంటి ఆనంద హార్మోన్లు అధికంగా ఉంటాయి. 

pixabay

చిలగడ దుంపలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీని వల్ల ఒత్తిడి స్థాయిలు అదుపులో ఉంటాయి.

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels