SSC CGL 2021 Tier III result out: సీజీఎల్ పరీక్ష ఫలితాలను ప్రకటించిన SSC
SSC CGLE 2021 Tier III ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) మంగళవారం ప్రకటించింది.
CGLE Tier III ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission SSC) మంగళవారం ప్రకటించింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 2023 జనవరి 4వ తేదీ నుంచి స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. CGLE Tier III ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ssc.nic.in.లో చెక్ చేసుకోవచ్చు.
Staff Selection Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని పలు కేటగిరీల ఉద్యోగాలను SSC భర్తీ చేస్తుంది. ఇందుకుగానూ వివిధ పరీక్షలను నిర్వహిస్తుంది. అందులో భాగంగానే కంబైన్డ్ గ్యాడ్యుయేట్ లెవెల్ పరీక్ష (Combined Graduate Level (Tier-III) Examination CGLE)ను వివిధ దశల్లో నిర్వహిస్తుంది. తాజాగా, మంగళవారం CGLE 2021 Tier III result ఫలితాలను ప్రకటించింది. సీజీఎల్ఈ 2021 టయర్ 2 (CGLE 2021 Tier II) ఫలితాలను SSC అక్టోబర్ 15న విడుదల చేసింది. ఆ ఫలితాల్లో JSO పోస్ట్ కోసం 504 మంది, AAO పోస్ట్ కోసం 2570 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
రిజల్ట్స్ చూసుకోవడం ఎలా?
CGLE 2021 Tier III result ఫలితాలను ఎస్ ఎస్ సీ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు .
- ముందుగా, ఎస్ ఎస్ సీ అధికారిక వెబ్ సైట్ ssc.nic.in కి వెళ్లాలి.
- హోం పేజ్ లో రిజల్ట్స్ (Result) లింక్ పై క్లిక్ చేయాలి.
- ఆ తరువాత వచ్చే పాప్ అప్ లో Combined Graduate Level Examination (Tier-III) 2021 result పై క్లిక్ చేయాలి.
- దాంతో, స్క్రీన్ పై ఒక పీడీఎఫ్ వస్తుంది. అందులో మీ అడ్మిట్ కార్డ్ నెంబర్ ఆధారంగా మీ ఫలితాన్ని చెక్ చేసుకోవచ్చు. భవిష్య్ అవసరాల కోసం లిస్ట్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
- అర్హత సాధించిన అభ్యర్థుల, అర్హత సాధించని అభ్యర్థుల మార్కుల వివరాలు SSC వెబ్ సైట్ లో డిసెంబర్ 30 నుంచి జనవరి 13 వరకు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ ఐడీ, పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి మార్కుల వివరాలను తెలుసుకోవచ్చు.