Southwest Monsoon : ఈ ఏడాది.. ఆలస్యంగా నైరుతి రుతుపవనాల రాక..!
16 May 2023, 10:37 IST
- Southwest Monsoon Kerala : ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతుందని స్కైమెట్ తెలిపింది. దీనిపై భారత వాతావరణశాఖ స్పందించాల్సి ఉంది.
ఈ ఏడాది ఆలస్యంగా రుతుపవనాల రాక..!
Southwest Monsoon Kerala : భానుడి భగభగలకు అల్లాడిపోతున్న ప్రజలకు మరో చేదు వార్త! కేరళలోకి నైరుతి రుతుపవనాల రాక ఈ ఏడాది ఆలస్యమవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది.
"ఈ ఏడాది జూన్‌లోనూ వాతావరణం వేడిగా ఉండే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవ్వొచ్చు," అని స్కైమెట్ ఫౌండర్, డైరక్టర్ జతిన్ సింగ్ తెలిపారు.
Southwest Monsoon delayed : రుతుపవనాల రాక ఆలస్యం అవుతుందన్న విషయంపై భారత వాతావరణ శాఖ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.
సాధారణంగా.. ప్రతి యేటా జూన్ 1కి అటు, ఇటుగా కేరళలోకి నైరుతు రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఫలితంగా వేసవి నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. వ్యవసాయానికి చాలా కీలకం ఈ రుతుపవనాల. సెప్టెంబర్ చివరి వరకు వీటి ప్రభావం ఉంటుంది.
వర్షపాతం ఎలా ఉంటుంది?
Southwest Monsoon latest news : రుతుపవనాల కారణంగా ఈ ఏడాది సాధారం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుంది అంచనా వేసింది స్కైమెట్. ఈ మేరకు గత నెలలో ఓ ప్రకటన చేసింది. ఇదే జరిగితే.. వ్యవసాయంపై ఆధారపడిన గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతుందని ఆందోళనలు మొదలయ్యాయి.
జూన్- సెప్టెంబర్‌లో ఎల్పీఏ (లాంగ్ పీరియడ్ యావరేజ్)లో 94శాతం వర్షపాతం నమోదవుతుందని, ఇందుకు ఎల్-నీనో కారణమని వివరించిది స్కైమెట్.
Monsoon 2023 forecast : మరోవైపు.. స్కైమెట్‌కు భిన్నంగా ప్రకటనలు చేసింది ఐఎండీ. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించింది. ఎల్పీఏలో 96శాతం వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
Monsoon 2023 India : 96-104శాతం వర్షపాతం నమోదైతే దానిని సాధారణంగా పరిగణిస్తారు. గతేడాది 106శాతం వర్షపాతం నమోదైంది.
భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
Temperature in Hyderabad : మరోవైపు తెలంగాణలో మరి కొన్ని రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదు ఉంటందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 42 నుంచి 44 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీలు వరకు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నేడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 9 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు అంచనా వేశారు.