తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపంతో జనం విలవిలలాడుతున్నారు. తీవ్ర వడగాల్పులతో జనం రోడ్లపైకి రావడానికే భయపడుతున్నారు. 

pixabay

By Bandaru Satyaprasad
May 15, 2023

Hindustan Times
Telugu

కోస్తా జిల్లాల్లో వడగాల్పులు ప్రభావం ఇంకా ఎక్కువ కనిపించింది. పలు ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

pixabay

కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, గుంటూరు, పల్నాడు, కాకినాడ, ప్రకాశం జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది.  

pexels

సాధారణం కంటే 4-6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

ANI

వాయవ్య భారత్ నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా ఏపీలో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ వివరించింది. 

pexels

ప్రకాశం జిల్లా తర్లుపాడులో అత్యధికంగా 46.05 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 45.98 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.  

pexels

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠంగా 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

pexels

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

pexels

శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే డీహైడ్రేషన్ అయినట్టే! జాగ్రత్త పడండి

Photo: Pexels