శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే డీహైడ్రేషన్ అయినట్టే! జాగ్రత్త పడండి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
May 19, 2024

Hindustan Times
Telugu

శరీరంలో నీటి శాతం తగ్గితే డీహైడ్రేషన్ అవుతుంది. ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేషన్‍కు గురైతే ఇబ్బందిగా అనిపిస్తుంది. శరీరం డీహైడ్రేషన్‍కు గురైందని చెప్పే లక్షణాలు ఇవే. 

Photo: Pexels

డీహైడ్రేషన్‍కు గురైతే శరీర సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. కావాల్సిన పనులు చేయలేకపోతారు. అలసటగా, ఆయాసంగా, శక్తిలేనట్టుగా అనిపిస్తుంది. 

Photo: Pexels

శరీరంలో ద్రవాలు తగ్గితే తలనొప్పిగా అనిపిస్తుంది. ఇది కూడా డీహైడ్రేషన్‍కు సంకేతమే. 

Photo: Pexels

డీహైడ్రేషన్‍కు గురైతే చర్మం పొడిబారడం, పెదాలు పగలడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక డీహైడ్రేషన్ అయినప్పుడు దాహం అవడం అనేది సాధారణమైన సంకేతం.  

Photo: Pexels

శరీరం డీహైడ్రేషన్‍కు గురవడం వల్ల మానసికంగానూ ఇబ్బందిగా అనిపిస్తుంది. చిటికీమాటికి చిరాకు పడతారు. కోపం ఎక్కువగా వస్తుంది.  

Photo: Pexels

డీహైడ్రేషన్ అయినట్టు అనిపించిన వెంటనే నీరు కచ్చితంగా తాగాలి. వేసవిలో డీహైడ్రేషన్‍కు గురి కాకుండా తరచూ నీరు, పండ్ల రసాలు లాంటి తాగుతూ ఉండాలి. ఎప్పుడు హైడ్రేటెడ్‍గా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.

Photo: Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels