Heat Wave Alert : ఏపీలో భానుడి భగభగలు... ఇవాళ, రేపు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు!
13 May 2023, 12:41 IST
- Telugu States Temperatures Updates: ఏపీపై మళ్లీ భానుడి భగభగలు పెరుగుతున్నాయి. రోజురోజుకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఐఎండీ అంచనాల ఆధారంగా ఏపీ విపత్తుల శాఖ పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలో భానుడి భగభగలు
Today Andhrapradesh Temperatures : ఆంధ్రప్రదేశ్ లో రోజురోజూకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా ప్రజలు బెంబెలేత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(Andhra Pradesh State Disaster Management Authority) హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరి,పెదకాకాని,తాడేపల్లి,తాడికొండ,తుళ్లూరు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఆదివారం(రేపు) 125 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 144 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 161 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇవాళ తివ్ర వడగాల్పులు వీచే అవకాశం..
మంగళగిరి(గుంటూరు జిల్లా)
పెదకాకాని,
తాడేపల్లి,
తాడికొండ,
తుళ్లూరు మండలంలో ఇవాళ తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
తెలంగాణలో ఇలా…
మరోవైపు తెలంగాణలో కూడా ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్ననాయి. ఇవాళ్టి నుంచి వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల 2 నుంచి 3 డిగ్రీలు పెరిగి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఎండ, వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని స్పష్టం చేసింది. ఒక వేళ బయటకు వెళ్తే ఎండ, వడగాల్పుల నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. తగినంత స్థాయిలో నీరు తాగాలని.. ఎండ ఇంట్లో పడకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. బయటకు వెళ్లాల్సి వస్తే… గొడుగు, టోపీ, సన్‌స్క్రీన్ ధరించాలని అడ్వైజ్ కూడా చేస్తున్నారు. కచ్చితంగా బయటకు వెళ్లవలసి వస్తే సాయంత్రం తర్వాత వెళ్తే బెటర్ అని చెబుతున్నారు. ఎక్కువగా మంచి నీరు,మజ్జిగ,గ్లూకోజు, నిమ్మరసం,కొబ్బరినీళ్లు తీసుకోవాలని చెబుతారు.