TS Weather Updates: ఇవాళ పలు జిల్లాలకు వర్ష సూచన, ఎల్లో అలర్ట్ జారీ! రేపట్నుంచి మళ్లీ పెరగనున్న ఎండలు!-rain forecast to telangana fro two days check weather updates are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Weather Updates: ఇవాళ పలు జిల్లాలకు వర్ష సూచన, ఎల్లో అలర్ట్ జారీ! రేపట్నుంచి మళ్లీ పెరగనున్న ఎండలు!

TS Weather Updates: ఇవాళ పలు జిల్లాలకు వర్ష సూచన, ఎల్లో అలర్ట్ జారీ! రేపట్నుంచి మళ్లీ పెరగనున్న ఎండలు!

HT Telugu Desk HT Telugu
May 11, 2023 04:51 PM IST

Weather Updates Telugu States: తెలంగాణకు మరోసారి వర్ష సూచన ఇచ్చింది వాతావరణశాఖ. గురువారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే రేపట్నుంచి మళ్లీ ఎండల తీవ్రత పెరగనుంది.

తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణకు వర్ష సూచన (twitter)

Weather Updates Telangana : తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా... గడిచిన రెండు రోజులుగా మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే ఇదిలా ఉంటే… మరోసారి వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. మరో ఒకటి రెండు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశాలున్నాయని వెల్లడించింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఎల్లో అలర్ట్....

ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి. నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలు వీస్తాయని అంచనా వేసింది, ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మళ్లీ భానుడి భగభగలు...!

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ క్రమంగా బలహీనపడటంతో... రాష్ట్రంలో మళ్లీ ఎండల తీవ్రత పెరుగుతోంది. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగుతుండటంతో ఎండలు మండిపోతున్నాయి. రేపట్నుంచి వాతావరణం పొడిగా మారుతుందని… రానున్న రెండ్రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయ ని గరిష్ట ఉష్ణోగ్రత 43డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పోల్చితే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని బులిటెన్ లో పేర్కొంది. ఈ పరిస్థితి కొంత కాలం పాటు ఉండే ఛాన్స్ ఉంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన (twitter)
Whats_app_banner