తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunstroke Precautions: వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

sunstroke precautions: వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

HT Telugu Desk HT Telugu

13 May 2023, 9:41 IST

google News
  • sunstroke precautions: ఆరోగ్య నిపుణులు ఈ వేసవిలో ఎండ దెబ్బను నివారించడానికి ముఖ్యమైన చిట్కాలతో పాటూ, రోగి ఆసుపత్రిలో చేర్చేవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. 

 heat stroke
heat stroke (Shutterstock)

heat stroke

వడదెబ్బ వల్ల మన శరీర ఉష్ణోగ్రత నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది. దానివల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. కాసేపు ఏదైనా పని ఉండి ఈ ఎండలో బయటికి వెళ్లొస్తేనే నీరసంగా, బలహీనంగా అనిపిస్తోంది. అలాంటిది రోజు మొత్తం ఎండలోనే ఎక్కువసేపు పని చేయాల్సిన ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. ఆటగాళ్లు, కార్మికులు, బయట విధులు నిర్వహించే పోలీసులకు ఈ ప్రమాదం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. వీళ్లు తప్పకుండా ఎండబారి నుంచి రక్షించుకోడానికి జాగ్రత్తలు తీసుకోవాలి.

అధిక ఉష్ణోగ్రతలో పనిచేస్తున్నపుడు చెమట బయటకు పంపి మన శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. చెమట ఆవిరైనప్పుడు కాస్త చల్లగా అనిపిస్తుంది. కానీ శారీరక శ్రమ ఎక్కువగా చేసే వాళ్లలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువుంటుంది. దాని వల్ల ఎక్కువ చెమట వస్తుంది. ఎక్కువ సమయం ఇలాగే ఉండే డీ హైడ్రేషన్ సమస్య వచ్చి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని డా. సందీప్ పాటిల్ HT లైఫ్‌స్టైల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

వడదెబ్బ తగలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి:

  • నీళ్లు ఎక్కువగా తాగాలి. బయట పనిచేసేవాళ్లు జ్యూసులు, కొబ్బరినీళ్లు, చల్లటి నీళ్లు తరచూ తీసుకుంటుండాలి.
  • ముదురు రంగు బట్టలు వేడిని గ్రహిస్తాయి. అందుకే లేత రంగులో, వదులుగా ఉండే బట్టలు వేసుకోండి.
  • ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగకండి.
  • ఆల్కహాల్ తాగడం మానేయాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండదు.
  • మధ్యాహ్న సమయంలో వ్యాయామాలు చేయకూడదు. ఉదయం, సాయంకాలంలోనే శారీరక కసరత్తులు చేయాలి.

వడదెబ్బ తగిలిన వ్యక్తిని ఎలా చూసుకోవాలి?

ఆసుపత్రికి తీసుకెళ్లేంత వరకు వడదెబ్బ(sun stroke) తగిలిన వ్యక్తి గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..

  • ముందుగా చల్లని నీడ ఉన్న ప్రదేశంలోకి వాళ్లని తీసుకెళ్లి పడుకోబెట్టండి.
  • తడి గుడ్డతో ఒళ్లు తుడవండి దాని వల్ల ఉష్ణోగ్రత తగ్గుతుంది. లేదంటే శరీరం మొత్తం గాలి తగిలేలా చూడండి.
  • వీలుంటే స్విమ్మింగ్ పూల్ లేదా బాత్ టబ్ లో తల తప్ప శరీరం మొత్తం మునిగేలా పడుకోబెట్టండి.
  • గోరు వెచ్చని నీళ్లని తల మీద పోయాలి.
  • ఉప్పు కలిపిన నీళ్లు ఇవ్వాలి.

తదుపరి వ్యాసం