TS Summer Updates: తెలంగాణలో మండుతున్న ఎండలు..మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి-imd said that the scorching sun in telangana will remain the same for a few more days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Summer Updates: తెలంగాణలో మండుతున్న ఎండలు..మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి

TS Summer Updates: తెలంగాణలో మండుతున్న ఎండలు..మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి

HT Telugu Desk HT Telugu
May 16, 2023 06:53 AM IST

TS Summer Updates: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. మరికొన్ని రోజులు ఇదే తరహా వాతావరణం తెలంగాణలో ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఎండకు తాళలేక ముఖంపై వస్త్రం కప్పుకున్న యువతులు
ఎండకు తాళలేక ముఖంపై వస్త్రం కప్పుకున్న యువతులు (PTI)

TS Summer Updates: తెలంగాణలో మరి కొన్ని రోజులు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదు ఉంటందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 42 నుంచి 44 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నుంచి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీలు వరకు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని అధికారులు తెలిపారు

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

రాష్ట్రవ్యాప్తంగా సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. ఎండ వేడికి తాళలేక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా జంకుతున్నారు. మూగ జీవాలు సైతం ఎండ, వేడిని తట్టుకులేక పోతున్నాయి. ప్రజలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జనం మధ్యాహ్నం వేళల్లో ఇంటికే పరిమితం అవుతున్నారు. వాయవ్య దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మంచిర్యాల, నిజామాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నల్లగొండ జిల్లాల్లో 45 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సోమవారం మంచిర్యాల జిల్లాలోని కొండాపూర్‌లో 45.8, జన్నారంలో 45.8, బెల్లంపల్లిలో 45.4, నీల్వాయి 45.5, కొమ్మెర 44, జగిత్యాల జిల్లా జైనాలో 45.5, కుమ్రంభీం జిల్లా కెరమెరిలో 45.4, నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌లో 45.1, నల్లగొండ జిల్లా పజ్జూరులో 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజులు ఇదే తరహాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచే ఎండల తీవ్రత కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటలు దాటి నా వేడిగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమో దవుతుండగా వచ్చే మూడు రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... కొన్ని జిల్లాల్లో 42ని-44 డిగ్రీల సెల్సియస్‌ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

సోమ వారం నల్లగొండలో 43.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవగా భద్రాచలంలో 43.2 డిగ్రీలు, ఖమ్మంలో 43 డిగ్రీల చొప్పు న ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఎండకు తాళలేక హనుమ కొండ జిల్లాలో ముస్కుపెంటు(52)అనే ఉపాధి హామీ కూలీ, మంచిర్యాల జిల్లాలో సంతోష్ కుమార్ అనే కానిస్టేబుల్‌ మృతి చెందారు.

IPL_Entry_Point