తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Heatwave: ప్రాణాలు తీస్తున్న ఎండలు; యూపీ, బిహార్ లలో ప్రాణాలు కోల్పోయిన పోలింగ్ సిబ్బంది

Heatwave: ప్రాణాలు తీస్తున్న ఎండలు; యూపీ, బిహార్ లలో ప్రాణాలు కోల్పోయిన పోలింగ్ సిబ్బంది

HT Telugu Desk HT Telugu

31 May 2024, 19:35 IST

google News
  • Heatwave: భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బిహార్ లలో వడ దెబ్బ తగిలి పదుల సంఖ్యలో పోలింగ్ సిబ్బంది చనిపోతున్నారు. జ్వరం, హైబీపీతో యూపీలోని మీర్జాపూర్ లో 13 మంది పోలింగ్ సిబ్బంది మృతి చెందారు.

యూపీ, బిహార్ లలో ఎండలకు ప్రాణాలు కోల్పోతున్న పోలింగ్ సిబ్బంది
యూపీ, బిహార్ లలో ఎండలకు ప్రాణాలు కోల్పోతున్న పోలింగ్ సిబ్బంది (AFP)

యూపీ, బిహార్ లలో ఎండలకు ప్రాణాలు కోల్పోతున్న పోలింగ్ సిబ్బంది

Heatwave : గత 24 గంటల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో లోక్ సభ ఎన్నికల కోసం విధులు నిర్వర్తిస్తున్న పలువురు ఎన్నికల సిబ్బంది మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో తీవ్ర జ్వరం, అధిక రక్తపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13 మంది ఎన్నికల సిబ్బంది మృతి చెందారు. అయితే ఈ మరణాలకు కచ్చితమైన కారణం తెలియాల్సి ఉందని, వడదెబ్బ కారణంగానే చనిపోయారని చెప్పలేమని మా వింధ్యవాసిని అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్ బహదూర్ కమల్ తెలిపారు. అస్వస్థతకు లోనైన ఎన్నికల సిబ్బందిని ఆసుపత్రికి తరలించగా వారందరికీ తీవ్ర జ్వరం, అధిక రక్తపోటు ఉందని తేలిందని వైద్యులు తెలిపారు.

మృతుల్లో ఏడుగురు హోంగార్డులు

చనిపోయినవారిలో ఏడుగురు హోంగార్డులు, ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక గుమస్తా, ఒక చక్బందీ అధికారి (కన్సాలిడేషన్ ఆఫీసర్), హోంగార్డు బృందంలోని ఒక ప్యూన్ ఉన్నారు.

సోన్ భద్ర జిల్లాలో ఇద్దరు మృతి..

యూపీలోని సోన్ భద్ర జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు పోలింగ్ సిబ్బంది మృతి చెందారు. రాబర్ట్స్ గంజ్ లోని డిస్పాచ్ సెంటర్ నుంచి పోలింగ్ బృందం ఈ రోజు బయలుదేరాల్సి ఉంది. వడదెబ్బకు ఓ పోలీసు అధికారి సహా ముగ్గురు పోలింగ్ అధికారులు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు పోలింగ్ అధికారులు మృతి చెందారు. ఇక్కడికి తీసుకువచ్చిన పోలింగ్ అధికారుల్లో వడదెబ్బ లాంటి లక్షణాలు కనిపించాయని సీఎంవో పేర్కొంది' అని సోన్ భద్ర డీఎం చంద్ర విజయ్ సింగ్ తెలిపారు.

బిహార్ లో 24 మంది మృతి

బిహార్ లో వడగాల్పుల తీవ్రతకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి. బిహార్ లోని ఔరంగాబాద్ లో వడదెబ్బతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, కైమూర్ జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్నఉద్యోగి సహా నలుగురు మృతి చెందారు. భోజ్ పూర్ లోని అర్రాలో ముగ్గురు మృతి చెందారు.

తదుపరి వ్యాసం