Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం… ప్రచారానికి బ్రేక్.. తెనాలి పర్యటన రద్దు-pawan kalyan has high fever campaign break tenali tour cancelled ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం… ప్రచారానికి బ్రేక్.. తెనాలి పర్యటన రద్దు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం… ప్రచారానికి బ్రేక్.. తెనాలి పర్యటన రద్దు

Sarath chandra.B HT Telugu
Apr 03, 2024 01:18 PM IST

Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. బుధవారం సాయంత్రం తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉండగా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో హైదరాబాద్‌ వెళ్లిపోయారు.

జ్వరంతో బాధపడుతున్న  పవన్ కళ్యాణ్‌.. ప్రచారానికి బ్రేక్
జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్‌.. ప్రచారానికి బ్రేక్

Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో ఎన్నికల ప్రచారానికి బ్రేక్ Break ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

బుధవారం సాయంత్రం తెనాలి tenali లో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేశారు. కనీసం రెండుమూడు రోజుల విశ్రాంతి Rest అవసరం అని వైద్యులు తెలిపారని, రీ షెడ్యూల్ ReSchedule చేసి పర్యటన పునః ప్రారంభిస్తారని ప్రకటించారు. పవన్‌ ప్రచారాలపై రీ షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు.

మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ భేరి యాత్రలో భాగంగా బుధవారం తెనాలిలో పర్యటిస్తారు. సాయంత్రం 4.30ని. లకు తెనాలి చేరుకుని వారాహి యాత్ర నిర్వహిస్తారు. తెనాలిలోని మార్కెట్ సెంటర్ లో బహిరంగ సభ నిర్వహించాలని భావించారు.

పిఠాపురంలో ప్రచారం..

పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్‌.. పర్యటనలో భాగంగా మంగళవారం నియోజక వర్గంలోని యు.కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల్లో పర్యటన చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు.

ప్రజానీకం సమస్యలు తెలుసుకునేందుకు జనం చెంతకు వెళ్లారు.. మత్స్యకార గ్రామాల్లో మహిళలతో ముచ్చటించారు.. 'అన్నా మా ఇంటికి రా' అని పిలిచిన ప్రతి ఇంటి గడప తొక్కారు.. మత్స్యకార గ్రామాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీధి వ్యాపారులను పలుకరించారు. ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నారు.

మంగళవారం రోజంతా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల పరిధిలో సుమారు పదికి పైగా గ్రామాల్లో ఎర్రటి ఎండలో నడుస్తూనే పర్యటించారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యల ప్రాధాన్యాన్ని చూసి ప్రతి ఒక్కటీ పరిష్కారం అయ్యేలా సమష్టిగా కృషి చేద్దామని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని స్థాపించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియచేస్తూ కూటమి అభ్యర్ధిగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ప్రతి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారికి అడుగడుగునా హారతులతో ఘనస్వాగతం పలికారు.

ఆంధ్రా బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ లో ప్రత్యేక ప్రార్ధనలతో పవన్ కళ్యాణ్ మంగళవారం పర్యటన ప్రారంభించారు. అనంతరం మాదాపురం, ఇసుకపల్లి, నాగులాపల్లి మీదుగా పొన్నాడ వెళ్లారు. పవన్ కళ్యాణ్ రాక విషయం తెలుసుకున్న ప్రజలు మాదాపురం నుంచి ఊరూ వాడా ఏకమై మంగళ హారతులు పడుతూ సాదర స్వాగతం పలికారు. మత్స్యకార గ్రామాలు, ఎస్సీ కాలనీల్లో ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి పూల వర్షం కురిపించారు. హారతులు పట్టి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదిలారు. సుమారు 20 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది.

మాదాపురం, ఇసుకపల్లి, నాగులపల్లి, పొన్నాడ, మూలపాడు, ఉప్పాడ, కొత్తపల్లి, కొండెవరం గ్రామాల మీదుగా సాగిన పవన్ కళ్యాణ్ పర్యటన అందరిని ఆకట్టుకుంది. రోడ్డు మీద వేచి ఉన్న ప్రతి ఒక్కరినీ కలుసుకున్నారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అందరితో ఫోటోలు దిగి, సెల్ఫీలు ఇస్తూ, కరచాలనాలు చేస్తూ ఉత్సాహపరిచారు. 'నేను పవన్ కళ్యాణ్, మీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. నాకు ఓటు వేసి గెలిపించండి' అంటూ నియోజకవర్గ ప్రజానీకాన్ని కోరారు.

Whats_app_banner

సంబంధిత కథనం