తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rrb Ntpc 2025: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 పోస్టులకు సంబంధించి కీలక అప్ డేట్

RRB NTPC 2025: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 పోస్టులకు సంబంధించి కీలక అప్ డేట్

Sudarshan V HT Telugu

09 October 2024, 15:52 IST

google News
  • RRB NTPC 2025: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 నోటిఫికేషన్ కు సంబంధించి కీలక అప్ డేట్ ను వెలువరించారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ లో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఆఖరు తేదీ గడువును పొడిగించారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు.

ర్ఆర్బీ ఎన్టీపీసీ 2025
ర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 (Rajkumar)

ర్ఆర్బీ ఎన్టీపీసీ 2025

RRB NTPC 2025: గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల భర్తీకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు గడువును రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) పొడిగించింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ (RRB NTPC UG 2025) అభ్యర్థులు అక్టోబర్ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ దరఖాస్తు గడువు అక్టోబర్ 20గా ఉండేది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ (RRB NTPC GRADUATE 2025) పోస్టులకు దరఖాస్తు గడువు అక్టోబర్ 20 వరకు పొడిగించారు. గతంలో ఇది అక్టోబర్ 13గా ఉండేది.

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 27
  • దరఖాస్తు విండో ముగిసిన తర్వాత ఫీజు చెల్లింపు తేదీ: అక్టోబర్ 28 నుంచి 29
  • ఎడిట్ విండో: అక్టోబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు.

గ్రాడ్యుయేట్ పోస్టులకు ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 20
  • దరఖాస్తు విండో ముగిసిన తర్వాత ఫీజు చెల్లింపు తేదీ: అక్టోబర్ 21 నుంచి 22
  • ఎడిట్ విండో: అక్టోబర్ 23 నుంచి 30 వరకు.

'అకౌంట్ క్రియేట్' ఫారంలో నింపిన వివరాలను, ఆర్ఆర్బీల ఎంపికలను కరెక్షన్ విండోలో ఎడిట్ చేయలేమని ఆర్ఆర్బీలు తెలిపాయి.

ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024: ఖాళీల వివరాలు

ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 11,558 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు 3,445 కాగా, గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు 8,113 ఉన్నాయి.

గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల ఖాళీలు.

  • చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్: 1,736 ఖాళీలు
  • స్టేషన్ మాస్టర్: 994 ఖాళీలు
  • గూడ్స్ ట్రైన్ మేనేజర్: 3,144 ఖాళీలు
  • జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 1,507 ఖాళీలు
  • సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 732 ఖాళీలు
  • మొత్తం: 8,113

అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల ఖాళీలు

  • కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2361 ఖాళీలు
  • జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 ఖాళీలు
  • ట్రైన్స్ క్లర్క్: 72 ఖాళీలు
  • మొత్తం: 3,445

దరఖాస్తు ఫీజు

ఆర్ఆర్బీ (RRB) ఎన్టీపీసీ 2024 దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్మెన్, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (EBC) అభ్యర్థులకు రూ.250. మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)కు హాజరయ్యే అభ్యర్థులు బ్యాంకు ఛార్జీల తగ్గింపు తర్వాత దరఖాస్తు ఫీజును పాక్షికంగా రీఫండ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఆర్ఆర్బీల అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.

తదుపరి వ్యాసం