RBI Officers Recruitment 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్
27 July 2024, 21:46 IST
RBI Officers Recruitment 2024: ఆర్బీఐ లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటఫికేషన్ విడుదల అయింది. అర్హులైన అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ rbi.org.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఆర్బీఐ లోని వివిధ శాఖల్లో 94 ఆఫీసర్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్
RBI Officers Recruitment 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ rbi.org.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 94 పోస్టులను భర్తీ చేయనున్నారు.
లాస్ట్ డేట్ ఆగస్ట్ 16
ఆర్బీఐ లో ఆఫీసర్ పోస్టుల కు అప్లై చేయడానికి ఆఖరు తేదీ ఆగస్టు 16. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలు 2024 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరుగుతాయి. దీనికి సంబంధించిన తేదీలు నోటిఫికేషన్ లో సవివరంగా ఉన్నాయి.
అర్హత, ఇతర వివరాలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అన్ని సెమిస్టర్లు/ సంవత్సరాల్లో కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ / తత్సమాన సాంకేతిక లేదా వృత్తిపరమైన అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు 50% ఉత్తీర్ణత ఉంటే చాలు. లేదా ఏదైనా విభాగంలో 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ / తత్సమాన సాంకేతిక లేదా వృత్తిపరమైన అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు పాస్ మార్క్ లు సాధిస్తే చాలు.
ఎంపిక విధానం
ఎంపిక విధానంలో ఫేజ్ 1, ఫేజ్ 2, ఇంటర్వ్యూ ఉంటాయి. ఫేజ్-1 పరీక్షలో 200 మార్కులకు ఒకే పేపర్ ఉంటుంది. ఇది 2024 సెప్టెంబర్ 08 న జరుగుతుంది. అభ్యర్థుల సంఖ్యను బట్టి వేర్వేరు రోజుల్లో, పలు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఫేజ్-1 ఫలితాల ఆధారంగా, బోర్డు నిర్ణయించిన కటాఫ్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే ఫేజ్-2 ఆన్ లైన్ పరీక్షను అక్టోబర్ 19, 2024న నిర్వహిస్తారు. ఫేజ్-2 పరీక్ష కూడా షిఫ్టుల్లో ఉంటుంది. ఫేజ్-2 (పేపర్-1+పేపర్-2+పేపర్-3)లో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫేజ్ 2, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా సెలక్షన్ లిస్ట్ ను సిద్ధం చేస్తారు.
దరఖాస్తు ఫీజు
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు రూ.100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. 18% జీఎస్టీ అదనం. జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.850 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. 18 శాతం జీఎస్టీ అదనం. అభ్యర్థులు డెబిట్ కార్డులు (రూపే/ వీసా/ మాస్టర్ కార్డ్/ మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు/ మొబైల్ వాలెట్లు, యూపీఐ ద్వారా అప్లికేషన్ ఫీజును చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఆర్బీఐ (rbi) అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.