RBI Grade B Result 2024: ఆర్బీఐ గ్రేడ్ బీ ఫలితాలు 2024 విడుదల; రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోండి
15 November 2024, 22:38 IST
RBI Grade B Result 2024: ఫేజ్ 2 కోసం ఆర్బీఐ గ్రేడ్ బీ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆర్బీఐ రిక్రూట్మెంట్ అధికారిక వెబ్ సైట్ rbi.org.in ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఆర్బీఐ గ్రేడ్ బి ఫలితాలు 2024 విడుదల; ఇలా చెక్ చేసుకోండి
RBI Grade B Result 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 ఆర్బీఐ గ్రేడ్ బీ ఫలితాలను ప్రకటించింది. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ 'బి' (డిఆర్)- జనరల్ ఫేజ్ 2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ rbi.org.in ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన రాత పరీక్షను 2024 అక్టోబర్ 19న నిర్వహించారు.
రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోండి
తమ ఫలితాలను చూసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
- ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ rbi.org.in ను సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న opportunities లింక్ పై క్లిక్ చేయండి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఉన్న రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- మళ్లీ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అభ్యర్థులు ఫేజ్ 2 ఆర్బీఐ గ్రేడ్ బీ ఫర్ ఫేజ్ 2 రిజల్ట్ 2024 పై క్లిక్ చేయాలి.
- పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు తమ రోల్ నంబర్ల ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
- రిజల్ట్ పేజీని డౌన్ లోడ్ చేసుకోండి. తదుపరి అవసరానికి దాని హార్డ్ కాపీని ఉంచండి.
ఈ డాక్యుమెంట్స్ పంపించండి..
ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు పూర్తిగా నింపిన బయోడేటా, సంబంధిత సర్టిఫికెట్లు / డాక్యుమెంట్ల స్కాన్ చేసిన కాపీలను నవంబర్ 21, 2024 లోగా ఆర్బిఐ (RBI) సర్వీసెస్ బోర్డు ఈ మెయిల్ ఐడీ అయిన documentsrbisb@rbi.org.in కి పంపించాలి.
ఇంటర్వ్యూ రౌండ్
రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ రౌండ్ కు హాజరుకావాలి. ఇంటర్వ్యూ తేదీని అభ్యర్థులకు తగిన సమయంలో తెలియజేస్తారు. ఇంటర్వ్యూ తేదీ, సమయం మరియు స్థలాన్ని సూచించే ఇంటర్వ్యూ కాల్ లెటర్లు షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు (సరైన సమయంలో) noreply.samadhan@rbi.org.in నుండి వారి రిజిస్టర్డ్ ఇమెయిల్ చిరునామాలకు పంపిస్తారు. దీని కోసం అభ్యర్థులు స్పామ్, జంక్ బాక్స్ సహా మెయిల్ బాక్స్ చెక్ చేసుకోవాలని కోరారు. ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 25న ప్రారంభమై ఆగస్టు 16, 2024న ముగిసింది. ఈ రిక్రూట్మెంట్ (recruitment) డ్రైవ్ లో 94 పోస్టులను భర్తీ చేయనున్నారు, వీటిలో 66 గ్రేడ్ 'బి' (డిఆర్)-జనరల్లో ఆఫీసర్లుగా, 21 గ్రేడ్ 'బి' (డిఆర్)-డిఇపిఆర్ లో ఆఫీసర్లుగా, 7 గ్రేడ్ 'బి' (డిఆర్)-డిఎస్ఐఎంలో ఆఫీసర్లుగా భర్తీ చేస్తారు.