102 ఖాళీల భర్తీకి సికింద్రాబాద్ లోని ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ (ECHS) ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ నడుస్తుండగా.. ఈ గడువు దగ్గరపడింది. రేపటితో(అక్టోబర్ 20) అప్లికేషన్ల ప్రాసెస్ పూర్తి అవుతుంది. అర్హులైన అభ్యర్థులు https://www.echs.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
కాంట్రాక్ట్ ప్రాతిపదికన 102 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. వీటిలో పారా మెడికల్, నాన్ మెడికల్ తో పాటు మెడికల్ కేటగిరి పోస్టులు ఉన్నాయి. 102 పోస్టుల్లో అత్యధికంగా మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు 24 ఉన్నాయి.