Army Recruitment 2024 : గుంటూరులో నవంబర్ 10 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ-indian army agniveer recruitment 2024 rally from november 10 in guntur ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Army Recruitment 2024 : గుంటూరులో నవంబర్ 10 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

Army Recruitment 2024 : గుంటూరులో నవంబర్ 10 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 18, 2024 05:36 PM IST

Indian Army Agniveer Recruitment 2024 : గుంటూరులో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీపై కీలక ప్రకటన వెలువడింది. నవంబర్ 10 నుంచి ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు.నవంబర్ 15వ తేదీన ర్యాలీ ముగుస్తుందని పేర్కొన్నారు. గుంటూరులోని DSA స్టేడియంలో ఈ ర్యాలీ ఉంటుందని తెలిపారు.

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

ఏపీలో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీపై కీలక ప్రకటన వెలువడింది. గుంటూరులోని DSA స్టేడియంలో నిర్వహించబోతున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. న‌వంబ‌ర్ 10 నుంచి 15 వ‌ర‌కు ఐదు రోజుల పాటు ర్యాలీ ఉంటుంది పేర్కొన్నారు.

ఈ ర్యాలీలో 13 జిల్లాల అభ్య‌ర్థుల‌కు మాత్ర‌మే పాల్గొనే ఛాన్స్ ఉంటుంది. క‌డ‌ప‌, క‌ర్నూలు, నెల్లూరు, అనంత‌పురం, గుంటూరు, ప‌ల్నాడు, ప్ర‌కాశం, చిత్తూరు బాప‌ట్ల‌, నంద్యాల‌, తిరుప‌తి, అన్న‌మ‌య్య‌, స‌త్యసాయి జిల్లాల‌కు చెందిన అభ్య‌ర్థులు హాజ‌రుకావాల్సి ఉంటుంది.

ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా…. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్10TH ట్రేడ్స్‌మన్, అగ్నివీర్ 8TH ట్రేడ్స్‌మన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్నివీర్ ట్రేడ్స్‌మన్ కు 8వ తరగతిని ఉత్తీర్ణతగా పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డులను తీసుకురావాల్సి ఉంటుంది.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ మరియు పారదర్శకంగా ఉంటుందని అధికారులు తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రిక్రూట్ మెంట్ ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రదర్శన ఉన్నవారినే ఎంపిక చేస్తారని స్పష్టం చేశారు.

ఫిజిక‌ల్ టెస్ట్‌లో భాగంగా 1,600 మీట‌ర్ల ర‌న్నింగ్ నిర్వ‌హిస్తారు. ర‌న్నింగ్‌లో క్వాలిఫై అయిన అభ్య‌ర్థుల‌కు ఇత‌ర ఈవెంట్లు, పరీక్ష‌లు ఉంటాయి. ఈ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి అభ్య‌ర్థులు భారీగా హాజ‌రవుతార‌ని అంచనా. రోజుకూ వెయ్యి మంది చొప్పున అభ్య‌ర్థుల‌కు ఎంపిక చేస్తారు. 

ఈ ర్యాలీలో ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఆర్మీ శిక్ష‌ణ నిర్వ‌హించ‌నున్నారు. అగ్నివీర్ జ‌న‌ర‌ల్ డ్యూటీ, టెక్నిక‌ల్‌, ఆఫీస్ అసిస్టెంట్‌, స్టోర్ కీప‌ర్ టెక్నిక‌ల్ విభాగాల్లో ఎంపికైన అభ్య‌ర్థులు ప‌ని చేయాల్సి ఉంటుంది. 

ప‌లు సూచ‌న‌లు జారీ చేశారు.

 

 

Whats_app_banner