Rashmika deepfake video : అసలు డీప్‌ఫేక్ వీడియో అంటే ఏంటి? ఎలా పసిగట్టాలి?
07 November 2023, 11:16 IST
- Rashmika deep fake video : డీప్‌ఫేక్ వీడియో అంటే ఏంటి? దీనిని మనం ఎలా పసిగట్టవచ్చు? రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియోలో ఏం ఉంది?
అసలు డీప్ ఫేక్ వీడియో అంటే ఏంటి? ఎలా పసిగట్టచ్చు?
Rashmika deepfake video : ప్రముఖ నటి రష్మిక మందన్నాకు సంబంధించిన “డీప్‌ఫేక్ వీడియో”పై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఘటనతో తాను చాలా బాధపడినట్టు సినీ నటి వ్యాఖ్యానించారు. అమితాబ్ బచ్చన్‌తో పాటు ఎందరో ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి విషయాలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలేంటి ఈ డీప్‌ఫేక్ వీడియో? దీనిని ఎలా పసిగట్టవచ్చు? అన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
డీప్‌ఫేక్ వీడియో అంటే ఏంటి..?
డీప్ లర్నింగ్, ఫేక్ పదాల కలయిక ఈ డీప్‌ఫేక్. దీని అర్థం.. ఒక వీడియోలోని అసలు వ్యక్తి ముఖాన్ని, శరీరాన్ని.. ఆల్గోరిథమ్‌ల సహాయంతో మార్ఫ్ చేయండి. ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారుతోంది. మరీ ముఖ్యంగా.. సెలబ్రెటీలు, ప్రముఖులు.. ఈ డీప్‌ఫేక్ వీడియో బారిన పడుతున్నారు.
What is deepfake video : డీప్‌ఫేక్ కోసం వాడిన ఆల్గోరిథమ్‌ల కారణంగా వీడియో చాలా ఆథెంటిక్‌గా, నిజంగా కనిపిస్తుంది. డీప్ లర్నింగ్ అనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని వాడుకుని ఫొటోలు, వీడియోలను మార్ఫ్ చేస్తూ ఉంటారు. అసలు ఎప్పుడు, ఎక్కడ జరగనివి, జరిగినట్టు చూపిస్తారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఈ డీప్‌ఫేక్ వ్యవహారం చాలా తలనొప్పిగా మారింది. ఈ సాఫ్ట్‌వేర్స్‌లో చాలా వరకు ఫ్రీగా ఉపయోగించుకునే అవకాశం ఉండటం ఆందోళనకర విషయం.
డీప్‌ఫేక్ వీడియోలను ఎలా పసిగట్టాలి?
డీప్‌ఫేక్ వీడియోలు దాదాపు నిజంగానే అనిపిస్తాయి. సరిగ్గా చూడకపోతే.. ఒరిజినల్ వీడియోకు, మార్ఫ్ చేసిన వీడియోకు మధ్య తేడా కనిపెట్టడం కాస్త కష్టమే. అలా అని.. పసిగట్టడం పూర్తిగా కష్టం కాదు! వీడియోలోని కొన్ని విషయాలను పరిగణించి.. అది ఫేక్ ఆ? ఒరిజినల్ ఆ? అన్నది తెలుసుకోవచ్చు.
Deepfake video meaning : కళ్ల కదలికలు, కను రెప్పలు కదలికలు సరిగ్గా లేకపోతే.. అది డీప్‌ఫేక్ వీడియో అయ్యుండొచ్చు.
మనిషికి, వెనకలా ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌కి మధ్య కలర్, బ్రైట్నెస్ వంటివి మ్యాచ్ అవ్వకపోతే అది ఫేక్‌గా భావించొచ్చు.
ఆడియో క్వాలిటీని కూడా చూడాలి. లిప్ సింక్ అవ్వకపోతే దానిని డీప్‌ఫేక్ వీడియో అనుకోవచ్చు.
కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యాల్లో శరీరం అకృతి, ముఖ కవళికలు వేరువేరుగా లేక సహజంగా ఉండకపోతే.. అది కచ్చితంగా ఫేక్ చేసినదే!
Rashmika Mandanna latest news : వీడియో మెటాడేటాను చూసి కూడా.. అది ఫేక్ ఆ? ఒరిజినల్ ఆ? అన్నది తెలుసుకోవచ్చు.
డీప్‌ఫేక్ డిటెక్షన్ టూల్స్ వంటివి వాడి.. వీడియో ఒరిజినాలిటీని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా.. ఇప్పుడు అనేక డిటెక్షన్ టూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి.
రష్మిక మందన్నా విషయంలో ఏం జరిగింది..?
రష్మిక మందన్నాకు సంబంధించినదిగా.. ఓ వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో రష్మిక లిఫ్ట్‌ని ఆపి లోపలికి వచ్చారు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఓ వ్యక్తితో మాట్లాడారు.
Deep fake video Rashmika Mandanna : అయితే.. ఆ వీడియోలో ఉన్నది రష్మిక కాదు! ఆ వీడియోలో ఉన్నది మరో మహిళ. ఆమె శరీరానికి.. రష్మిక ముఖాన్ని మార్ఫ్ చేశారు. ఇందుకోసం డీప్‌ఫేక్ టెక్నాలజీని వాడుకున్నారు.