Rashmika Mandanna: ర‌ష్మిక మంద‌న్న‌కు "బిగ్‌బీ" స‌పోర్ట్ - మార్ఫింగ్‌ వీడియోపై లీగ‌ల్‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌-amitabh bachchan reacts on rashmika mandanna fake morphing video big b demands legal action ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Amitabh Bachchan Reacts On Rashmika Mandanna Fake Morphing Video Big B Demands Legal Action

Rashmika Mandanna: ర‌ష్మిక మంద‌న్న‌కు "బిగ్‌బీ" స‌పోర్ట్ - మార్ఫింగ్‌ వీడియోపై లీగ‌ల్‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 06, 2023 12:49 PM IST

Rashmika Mandanna: బ్లాక్ యోగా సూట్‌లో బోల్డ్ లుక్‌లో ర‌ష్మిక మంద‌న్న క‌నిపిస్తోన్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈ ఫేక్ మార్ఫింగ్ వీడియోపై బిగ్ బీ అమితాబ్‌బ‌చ్చ‌న్ ఫైర్ అయ్యారు. ఫేక్ వీడియోల‌ను క్రియేట్ చేస్తోన్న వారిపై లీగ‌ల్‌గా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ర‌ష్మిక మంద‌న్న, అమితాబ్‌బ‌చ్చ‌న్
ర‌ష్మిక మంద‌న్న, అమితాబ్‌బ‌చ్చ‌న్

Rashmika Mandanna: ర‌ష్మిక మంద‌న్న ఫేక్ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. జారా ప‌టేల్ అనే మోడ‌ల్ వీడియోను మార్ఫింగ్ చేసి ర‌ష్మిక మంద‌న్న గా క్రియేట్ చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈ వీడియోలో బ్లాక్ యోగా సూట్‌లో ర‌ష్మిక మంద‌న్న బోల్ట్ లుక్‌లో క‌నిపించింది. నిజంగానే ఈ వీడియో ర‌ష్మిక మంద‌న్న‌దేన‌ని చాలా మంది నెటిజ‌న్లు పొర‌ప‌డ్డారు.

ర‌ష్మిక మంద‌న్న గ్లామ‌ర్ ప‌రంగా డోసు పెంచేసింద‌ని అనుకున్నారు. కానీ ఇది ఫేక్ వీడియో అని ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. జారా ప‌టేల్ ఒరిజిన‌ల్ వీడియోతో పాటు ర‌ష్మిక మంద‌న్న ఫేక్ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఏఐ సాంకేతిక‌త‌తో దీనిని ఎలా మార్ఫింగ్ చేశారో కూడా ఆ నెటిజ‌న్ చూపించాడు. ఇలాంటి ఫేక్‌, మార్ఫింగ్ వీడియోల‌పై లీగ‌ల్‌గా యాక్ష‌న్ తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉందంటూ స‌ద‌రు నెటిజ‌న్ పేర్కొన్నాడు.

ఆ నెటిజ‌న్ కామెంట్స్‌ను బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్‌, బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ స‌మ‌ర్ధించాడు. ఇలాంటి ఫేక్ వీడియోల‌ను క్రియేట్ చేసే వారిపై లీగ‌ల్‌గా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు. ర‌ష్మిక మంద‌న్న‌కు స‌పోర్ట్ చేస్తూ అమితాబ్ బ‌చ్చ‌న్ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

అమితాబ్‌బ‌చ్చ‌న్‌తో క‌లిసి ర‌ష్మిక మంద‌న్న‌గుడ్‌బై అనే బాలీవుడ్ మూవీ చేసింది. ఇందులో అమితాబ్ కూతురికిగా ర‌ష్మిక మంద‌న్న న‌టించింది. ఈ సినిమాతోనే ర‌ష్మిక బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గుడ్‌బైలో ర‌ష్మిక యాక్టింగ్‌కు పేరొచ్చిన క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ఈ సినిమా స‌క్సెస్‌ను సాధించ‌లేక‌పోయింది.

ప్ర‌స్తుతం హిందీలో యానిమ‌ల్‌తో పాటు విక్కీ కౌశ‌ల్‌తో మ‌రో సినిమా చేస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. మ‌రోవైపు తెలుగులో ర‌ష్మిక మంద‌న్న ఫుల్ బిజీగా ఉంది. అల్లు అర్జున్ పుష్ప 2తో పాటు ధ‌నుష్, శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

WhatsApp channel