తెలుగు న్యూస్  /  National International  /  Rahul Gandhi's Bharat Jodo Yatra To End Tomorrow In Jk, These Opposition Parties To Attend

Bharat Jodo Yatra : భారత్​ జోడో యాత్రకు రేపే ముగింపు.. రాహుల్​ శ్రమ ఫలించేనా?

29 January 2023, 11:11 IST

    • Bharat Jodo Yatra today : భారత్​ జోడో యాత్రకు సోమవారం ముగింపు పడనుంది. శ్రీనగర్​లో నిర్వహించిన ముగింపు సభలో పాల్గొనాలని 21 పార్టీలను కాంగ్రెస్​ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వాటిల్లో కేవలం పార్టీలే హాజరవుతాయని సమాచారం.
భారత్​ జోడో యాత్రకు రేపే ముగింపు
భారత్​ జోడో యాత్రకు రేపే ముగింపు

భారత్​ జోడో యాత్రకు రేపే ముగింపు

Bharat Jodo Yatra live : కాంగ్రెస్​ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కన్యాకుమారి టు కశ్మీర్​ "భారత జోడో యాత్ర"కు సోమవారంతో ముగింపు పడనుంది. ఈ సందర్భంగా.. శ్రీనగర్​లో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్​ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీతో పాటు దేశంలోని విపక్షానికి చెందిన కీలక నేతలు ఇందులో పాల్గొననున్నారని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

యాత్రకు దూరంగా ఆ పార్టీలు..!

భారత్​ జోడో యాత్ర ముగింపు వేడుకల కోసం విపక్షానికి చెందిన మొత్తం 21 పార్టీలను కాంగ్రెస్​ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వీటిల్లో 12 పార్టీలు మాత్రమే.. కశ్మీర్​కు వెళ్లనున్నట్టు సమాచారం.

Bharat Jodo Yatra in Jammu Kashmir : ఎంకే స్టాలిన్​ నేతృత్వంలోని డీఎంకే, శరద్​ యాదవ్​ ఎన్​సీపీ, తేజస్వీ యాదవ్​ ఆర్​జేడీ, నితీశ్​ కుమార్​ జేడీయూ, ఉద్ధవ్​ ఠాక్రే శివసేన, సీపీఐఎం, సీపీఐ, వీసీకే (విద్యుథలై చిరుథైగల్​ కచ్చి), కేరళ కాంగ్రెస్​, ఫరూక్​ అబ్దుల్లా నేషనల్​ కాన్ఫరెన్స్​, మెహబూబా ముఫ్తీ పీడీపీ, శిబు సొరేన్​కు చెందిన ఝార్ఖండ్​ ముక్తి మోర్చా పార్టీలు.. శ్రీనగర్​లో జరగనున్న సభకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.

మమతా బెనర్జీకి చెందిన తృణమూల్​ కాంగ్రెస్​, అఖిలేష్​ యాదవ్​ సమాజ్​వాదీ పార్టీ, చంద్రబాబు నాయుడు టీడీపీతో పాటు మరికొన్ని విపక్ష బృందాలు.. భారత్​ జోడో యాత్ర ముగింపు సభకు దూరంగా ఉండనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భద్రతా కారణాలతో ఆయా పార్టీలు సభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు వివరించాయి.

కన్యాకుమారి టు కశ్మీర్​.. భారత్​ జోడో యాత్ర..

Bharat Jodo Yatra today : అంతర్గత కుమ్ములాటలు, ఎన్నికల్లో వరుస ఓటములు, పార్టీ ఫిరాయింపులు, వలస మధ్య రాహుల్​ గాంధీ అధ్యక్షతన సాగుతున్న ఈ 'భారత్​ జోడో యాత్ర'.. కాంగ్రెస్​కు నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్​ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర.. 3,900 కిమీలు ప్రయాణించి కశ్మీర్​కు కొన్ని రోజుల క్రితమే చేరుకుంది. ఈ 145 రోజుల యాత్ర.. సోమవారంతో ముగియనుంది.

దాదాపు 4వేల కిలోమీటర్ల ప్రయాణంలో.. లక్షలాది మంది ప్రజలను కలిశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా.. భారతీయులను ఏకం చేసేందుకే ఈ యాత్ర చేపట్టినట్టు చెబుతూ వచ్చారు.

Rahul Gandhi Bharat Jodo Yatra : ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక వచ్చే ఏడాది.. మెగా వార్​ 2024 లోక్​సభ ఎన్నికలు జరగనున్నాయి. భారత్​ జోడో యాత్ర కోసం రాహుల్​ గాంధీ పడిన శ్రమ, బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్​ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి అన్నది వేచి చూడాలి.