Priest killed : పూజారి దారుణ హత్య- బిహార్లో ఉద్రిక్తత.. తగలబడిన పోలీసు వాహనం!
17 December 2023, 17:20 IST
- Priest killed : బిహార్లోని ఓ గ్రామంలో ఓ పూజారి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ వార్త కలకలం రేపింది. ఫలితంగా గ్రామంలో ఘర్షణలు చెలరేగాయి. పోలీసులపైనా గ్రామస్థులు దాడి చేశారు.
పూజారి దారుణ హత్య- బిహార్లోని ఆ గ్రామంలో ఉద్రిక్తత!
Priest killed in Bihar : బిహార్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గోపాల్గంజ్ జిల్లాలో ఓ పూజారి దారుణ హత్యకు గురయ్యాడు! అతని మృతదేహాన్ని చూసి పోలీసులే షాక్ అయ్యారు.
ఇదీ జరిగింది..
గోపాల్గంజ్ జిల్లాలోని దానాపూర్ గ్రామంలో నివాసముండే 32ఏళ్ల మనోజ్ కుమార్.. స్థానికంగా ఉండే శివాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. అతని సోదరుడు.. బీజేపీలో కార్యకర్తగా ఉండేవాడు.
కాగా.. 32ఏళ్ల మనోజ్.. గత సోమవారం రాత్రి అదృశ్యమయ్యాడు. అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు.. శనివారం అర్థరాత్రి సమయంలో మనోజ్ మృతదేహం కనిపించింది. అతడిని ఎవరో అతి కిరాతకంగా చంపేశారు. పోలీసులు చూసేసరికి, అతని కళ్లు బయటకు వచ్చి పడి ఉన్నాయి!
Bihar priest murder case : ఆదివారం ఉదయం నాటికి ఈ వార్త గ్రామంలో కలకలం సృష్టించింది. మనోజ్ కుమార్ హత్యకు నిరసనగా.. గ్రామస్థులు నిరసనకు దిగారు. గ్రామం నుంచి వెళ్లే జాతీయ రహదారిపై బైటాయించారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే మనోజ్ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఘర్షణలు మొదలయ్యాయి. అదే సమయంలో పరిస్థితిని అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసులపైనా గ్రామస్థులు దాడి చేశారు. ఓ పోలీసు వాహనానికి నిప్పంటించారు. ఈ ఘటనల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. గ్రామానికి అదనపు బలగాలను తరలించారు. కొంత సమయం తర్వాత.. పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం అక్కడ అందరు ప్రశాంతంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు.
Bihar crime news latest : మరోవైపు.. పూజారి మనోజ్ కుమార్ దారుణ హత్యపై కేసు నమోదు చేసుకున్నట్టు, దర్యాప్తును ప్రారభించినట్టు అధికారులు వెల్లడించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని గ్రామస్థులకు హామీనిచ్చారు.
అసలు పూజారిని ఎవరు చంపారు? ఎందుకు చంపాల్సి వచ్చింది? అతనికి, అతని కుటుంబానికి పాత గొడవలు ఏవైనా ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది.
పిల్లలను చంపి.. మాసం వండుకుని తిని..!
ఇటీవలి కాలంలో నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ఇండియాతో పాటు పొరుగు దేశం పాకిస్థాన్లో కూడా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఓ వ్యక్తి.. ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేసి, వారిలో ఇద్దరిని చంపేశాడు. అనంతరం వారి మాంసాన్ని వండుకుని తిన్నాడు!
పాకిస్థాన్ ముజాఫర్గఢ్లో జరిగింది ఈ ఘటన. ఫయ్యాజ్ అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు అలీ హసన్ (7ఏళ్లు), అబ్దుల్లా (3ఏళ్లు) హఫ్జా (ఏడాదిన్నర). కాగా.. ఓ వ్యక్తి ఈ ముగ్గురు పిల్లలను 6 రోజుల క్రితం కిడ్నాప్ చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.