Crime news : పిల్లలను చంపి.. వారి మాంసాన్ని వండుకుని తిన్న వ్యక్తి అరెస్ట్​!-pakistan man arrested for killing children eating their flesh ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : పిల్లలను చంపి.. వారి మాంసాన్ని వండుకుని తిన్న వ్యక్తి అరెస్ట్​!

Crime news : పిల్లలను చంపి.. వారి మాంసాన్ని వండుకుని తిన్న వ్యక్తి అరెస్ట్​!

Sharath Chitturi HT Telugu
Dec 15, 2023 07:31 AM IST

Pakistan crime news : ముగ్గురు పిల్లలను ఓ వ్యక్తి ఇటీవలే కిడ్నాప్​ చేశాడు. వారిలో ఇద్దరిని చంపి.. వారి మాంసాన్ని వండుకుని తిన్నాడు! ఈ ఘటన పాకిస్థాన్​లో కలకలం రేపింది.

పిల్లలను చంపి, వారి మాంసాన్ని వండుకుని తిన్న వ్యక్తి అరెస్ట్​!
పిల్లలను చంపి, వారి మాంసాన్ని వండుకుని తిన్న వ్యక్తి అరెస్ట్​!

Pakistan crime news : పాకిస్థాన్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి, ముగ్గురు పిల్లలను కిడ్నాప్​ చేశాడు. వారిలో ఇద్దరిని కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత.. వారి మాంసాన్ని వండుకుని తిన్నాడు!

ఇదీ జరిగింది..

పాకిస్థాన్​ ముజాఫర్​గఢ్​లో జరిగింది ఈ ఘటన. ఫయ్యాజ్​ అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు అలీ హసన్​ (7ఏళ్లు), అబ్దుల్లా (3ఏళ్లు) హఫ్​జా (ఏడాదిన్నర). కాగా.. ఓ వ్యక్తి ఈ ముగ్గురు పిల్లలను 6 రోజుల క్రితం కిడ్నాప్​ చేశాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. ఇటీవలే.. అలీ హసన్​ని రక్షించారు. అతను చెప్పిన విషయాలను విని.. పోలీసులే షాక్​కు గురయ్యారు.

Pakistan man eats human flesh : అలీ హసన్​ ప్రకారం.. నిందితుడు.. అబ్దుల్లా, హఫ్​జాలను కత్తితో అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత వారి మాంసాన్ని తీసి వండుకుని తిన్నాడు! 7ఏళ్ల హసన్​ను చంపేలోపే.. పోలీసులు నిందితుడి గురించి తెలుసుకుని, పిల్లాడిని అరెస్ట్​ చేశారు.

కాగా.. పోలీసులు వచ్చేలోపు.. పిల్లల మాంసంతో వండిన వంటను.. స్థానికంగా ఉండే దర్గాలో పంచినట్టు తెలుస్తోంది.

Man kills children to eat flesh : నిందితుడిని అరెస్ట్​ చేసిన పోలీసులు.. అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు పిల్లలను చంపాడు? అన్న వివరాలపై క్లారిటీ లేదు. అతడు స్పృహలోకి వచ్చిన తర్వాత విచారిస్తామని, అప్పుడు నిజాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు స్పష్టం చేశారు.

మరోవైపు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం