తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Parliament Monsoon Session : ‘నారీ శక్తి’కి చిహ్నం.. ఈ చిత్రం!

Parliament monsoon session : ‘నారీ శక్తి’కి చిహ్నం.. ఈ చిత్రం!

Sharath Chitturi HT Telugu

18 July 2022, 17:52 IST

google News
    • Parliament monsoon session : పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మహిళా ఎంపీలు ఒక్కచోటకు చేరారు. అందరు కలిసి ఫొటో దిగారు.
‘నారీ శక్తి’కి చిహ్నం.. ఈ చిత్రం!
‘నారీ శక్తి’కి చిహ్నం.. ఈ చిత్రం! (Twitter/ Fauzia Khan)

‘నారీ శక్తి’కి చిహ్నం.. ఈ చిత్రం!

Parliament monsoon session : పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల వేళ 'నారీ శక్తి' ఒక్కచోటుకు చేరింది. సోమవారం పార్లమెంట్​ సెషన్​ ప్రారంభం కాగా.. మహిళా ఎంపీలు అందరు కలిశారు. పార్లమెంట్ సెంట్రల్​ హాల్​లో ఫొటోలు దిగారు. వీరిలో ఎస్​పీ ఎంపీ జయా బచ్చన్​, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఎన్​సీపీకి చెందిన సుప్రియ సులే కూడా ఉన్నారు.

"పార్లమెంట్​ సెంట్రల్​ హాల్​లో స్త్రీ శక్తి. తిరిగిరావడం(పార్లమెంట్​కు​) చాలా సంతోషంగా ఉంది," అని ఎన్​సీపీ ఎంపీ ఫౌజియా ఖాన్​ ట్వీట్​ చేశారు.

ఉభయ సభలు వాయిదా..

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో తొలి రోజు ఓ కీలక ఘట్టం ముగిసింది. రాష్ట్రపతి ఎన్నికకు సాయంత్రం ​5 గంటలతో తెరపడింది.

ఇదిలా ఉండగా.. ఉభయ సభలు తొలిరోజే వాయిదా పడ్డాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వ్యూహాలను తొలిరోజే అమలు చేశాయి విపక్షాలు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలు, అగ్నిపథ్​ పథకం నేపథ్యంలో తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు విపక్ష ఎంపీలు. ఫలితంగా లోక్​సభ, రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడ్డాయి.

అంతకుముందు.. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వారిలో ఉన్న భారత మాజీ క్రికెటర్​ హర్భజన్​ సింగ్​.. సోమవారం ప్రమాణం చేశారు. అనంతరం రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేశారు.

టాపిక్

తదుపరి వ్యాసం