Crime news : వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్య.. చేతిలో సూసైడ్ నోట్ రాసుకుని!
15 October 2023, 11:05 IST
Maharashtra crime news : వరకట్న వేధింపులకు మరో మహిళ బలైంది! అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక.. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్య.. చేతిలో సూసైడ్ నోట్ రాసుకుని!
Maharashtra crime news : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వరకట్న వేధింపులను తట్టుకోలేక పోయిన ఓ మహిళ.. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది.
ఇదీ జరిగింది..
మహారాష్ట్ర పాల్గఢ్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. నల్లా సోపారా అనే ప్రాంతానికి చెందిన వ్యక్తితో.. 2022 మేలో 24ఏళ్ల మహిళకు వివాహమైంది. అతను.. ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
పెళ్లి జరిగిన రెండు నెలలకే.. ఆ మహిళ, తన ప్రశాంతతను కోల్పోయింది. 'ఇంటి నుంచి రూ. 5లక్షలు తీసుకురా' అని మహిళపై ఆమె భర్త తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. కానీ మహిళ తరఫు కుటుంబసభ్యులు వరకట్నం డబ్బులు ఇవ్వలేకపోయారు.
ఈ క్రమంలో.. మహిళ, తన తండ్రితో తన బాధను పంచుకుంది.
Woman suicide in Maharashtra : "ఓసారి నేను నా కూతురికి ఫోన్ చేశాను. వరకట్నం కోసం అందరు వేధిస్తున్నారని చెప్పింది. కొడుతున్నారని కన్నీరు పెట్టుకుంది. ఇక తట్టుకోలేదని చెప్పింది," అని ఆ మహిళ తండ్రి తెలిపారు.
ఈ క్రమంలో.. శుక్రవారం సాయంత్రం మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింట్లో.. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషయాన్ని స్థానికులు.. బాధితురాలి తండ్రికి ఫోన్ చేసి చెప్పారు.
Dowry harassment case Maharashtra : మరోవైపు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పరిశీలిస్తుండగా.. చేతిలో కొన్ని అక్షరాలు కనిపించాయి. తన చావుకు కారణం, తన భర్త, అత్తామామలేనని చేతిలో రాసుకుని ఆ మహిళ ప్రాణాలు విడిచింది.
అదే సమయంలో.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఫిర్యాదు చేశాడు బాధితురాలి తండ్రి. ఘటనపై కసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళ భర్తతో పాటు అతని తండ్రిని కూడా అరెస్ట్ చేశారు.
ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను శిక్షిస్తామని మహిళ కుటుంబానికి పోలీసులు హామీనిచ్చారు.
నీట్ విద్యార్థినిపై అత్యాచారం..
దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా.. మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు ఆందోళనకరంగా మారాయి. రాజస్థాన్ కోటాలో నీట్ కోచింగ్ తీసుకుంటున్న ఓ విద్యార్థినిపై ఓ టిఫిన్ డెలివరీ బాయ్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది.
బిహార్‌కు చెందిన ఓ 15ఏళ్ల బాలిక.. నీట్ కోచింగ్ కోసం రాజస్థాన్ కోటాకు వెళ్లింది. అక్కడి ఓ హాస్టల్లో.. తన సోదరితో కలిసి జీవిస్తోంది. కాగా.. గత ఫిబ్రవరిలో.. ఆమెను ఓ టిఫిన్ బాయ్ కలిశాడు. ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చి మాటలు కలిపాడు. అలా.. వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. కొద్ది రోజులు మాట్లాడుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.