Crime news : 17ఏళ్లకే పెళ్లి.. ఆ వెంటనే గర్భం- బాలిక భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు..!
Crime news : ఓ 17ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమెకు 9వ నెల. కాగా.. ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.
Mumbai crime news : ముంబైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన 17ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమెకు 9వ నెల. ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది..
తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి.. కొన్నేళ్లుగా ముంబైలో ఉంటూ పనిచేసుకుంటున్నాడు. కాగా.. గతేడాది.. తమిళనాడుకు వెళ్లాడు. అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ, వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. ప్రేమికులు ఇద్దరు కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో.. తమిళనాడులోని ఓ స్థానిక గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఇండియాలోని చట్టాల ప్రకారం.. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిల కనీస వయస్సు అర్హత 18ఏళ్లు. అంటే.. ఈమె.. పెళ్లి సమయంలో.. ఇంకా మైనరే!
తమిళనాడులో పెళ్లి చేసుకున్న ఆ ప్రేమ జంట.. తొమ్మిది నెలల క్రితం ముంబైకి వచ్చింది. ఇంతలో.. బాలికి గర్భం దాల్చింది.
ఇలా బయటపడింది..
Man marries minor : గత సోమవారం.. 9నెలల గర్భవతిని తీసుకుని గోవిండిలోని శతాబ్ది ఆసుపత్రుకి వెళ్లాడు భర్త. ఆమె వయస్సు చూసి వైద్యులకు అనుమానం కలిగింది. ఆమె ఇంకా మైనరే అయ్యి ఉంటుందని అనుమానించారు. ఈ క్రమంలో.. పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. బాలికను విచారించారు. బాలికకు తమిళ్ తప్ప హిందీ, మరాఠీ రాకపోవడంతో.. ఆమె ఏం చెబుతోందో కొంతసేపు పోలీసులకు అర్థం కాలేదు. తమిళం వచ్చిన కొందరు వైద్యుల సాయం తీసుకున్నారు. బాలిక.. తన వయస్సు 17ఏళ్లు అని పోలీసులకు చెప్పింది. తొమ్మిది నెలల క్రితం తనకు పెళ్లి జరిగిందని వివరించింది.
Mumbai Minor girl pregnant : మైనర్‌ను పెళ్లి చేసుకున్న కారణంగా.. బాలిక భర్తపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారు.
"పెళ్లికి ముందు బాలిక వయస్సు గురించి భర్త తరఫు కుటుంబానికి తెలుసా? లేదా? అన్న విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదు. పెళ్లి తర్వాత గర్భం దాల్చిన విషయం.. బాలిక తరఫు కుటుంబానికి తెలుసా? అన్న విషయంపైనా వారిద్దరు సరైన సమాధానాలు ఇవ్వడం లేదు. ఆ వ్యక్తిని మాత్రం కస్టడీలోకి తీసుకున్నాము. చైల్డ్ వెల్ఫేర్ కమీటీ.. బాలికకు కౌన్సిలింగ్ ఇస్తుంది. ఆమె పరిస్థితి బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాము," అని ఓ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.
సంబంధిత కథనం