Delhi dowry case : 'నా బిడ్డను బాధ పెట్టకండి..' వరకట్న వేధింపుల బాధితురాలు ఆత్మహత్య!
15 May 2023, 17:02 IST
Delhi dowry case : ‘నా కూతురిని బాధ పెట్టకండి’ అంటూ ఢిల్లీలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్నేళ్లుగా ఆమ వరకట్నం వేధింపులకు గురవుతున్నట్టు తెలుస్తోంది.
'నా బిడ్డను బాధ పెట్టకండి..' వరకట్న వేధింపుల బాధితురాలు ఆత్మహత్య!
Delhi dowry case : వరకట్నం వేధింపులు భరించలేక ఢిల్లీలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. తన బిడ్డ గురించి చేతిలో రాసుకుని మరీ ఆమ ప్రాణాలు తీసుకుంది!
సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ..
37ఏళ్ల లక్ష్మి గుప్తా.. తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని టిగ్రి ప్రాంతంలో నివాసముంటోంది. కాగా.. సోమవారం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన ఆమె మృతదేహాన్ని చూసి, ఆమె మరిది పోలీసులకు సమాచారాన్ని అందించాడు.
Delhi dowry death case : ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. లక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఎడమ చేతిపై 'నా కూతురిని బాధ పెట్టకండి,' అని రాసి ఉండటాన్ని గమనించారు. ఇంటిని పరిశీలించగా.. పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.
పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
వరకట్నం వేధింపులే కారణమా..?
ఆత్మహత్యకు పాల్పడిన మహిళ తల్లి ప్రకారం.. లక్ష్మికి 2017 జనవరి 16న జితందర్ గుప్తా అనే వ్యక్తితో వివాహమైంది. అప్పటి నుంచి ఆమె వరకట్నం వేధింపులకు గురవుతోంది. జితేందర్ గుప్తాతో పాటు అతను తమ్ముడు.. కట్నం కోసం లక్ష్మిని మానసికంగా వేధించారు.
Delhi dowry death case news : ఈ మేరకు లక్ష్మి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై సెక్షన్ 304బీ, 498ఏ, 506, 34 కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా.. నిందితులను పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.
Delhi woman suicide : ఢిల్లీ ఎయిమ్స్‌లో మహిళ పోస్టుమార్టం జరగనుందని, అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.