Rapido rider gropes woman: మహిళా ప్రయాణికురాలికి ర్యాపిడో డ్రైవర్ వేధింపులు
Rapido rider gropes woman: రాత్రి సమయంలో ర్యాపిడో (Rapido) బైక్ టాక్సీని బుక్ చేసుకున్న యువతిని ర్యాపిడో బైక్ టాక్సీ డ్రైవర్ వేధింపులకు గురి చేశాడు. బుక్ చేసుకున్న సమయంలో తెలిపిన గమ్యానికి కాకుండా, వేరే ప్రదేశానికి తీసుకెళ్తుండడంతో, భయాందోళనలకు గురైనా ఆ యువతి బైక్ పై నుంచి దూకేసింది.
Rapido rider gropes woman: రాత్రి సమయంలో ర్యాపిడో బైక్ టాక్సీని బుక్ చేసుకున్న 30 ఏళ్ల యువతిని ర్యాపిడో (Rapido) బైక్ టాక్సీ డ్రైవర్ వేధింపులకు గురి చేశాడు. బుక్ చేసుకున్న సమయంలో తెలిపిన గమ్యానికి కాకుండా, వేరే ప్రదేశానికి తీసుకెళ్తుండడంతో, భయాందోళనలకు గురైనా ఆ యువతి బైక్ పై నుంచి దూకేసింది.
Rapido rider gropes woman: ర్యాపిడో డ్రైవర్ దారుణం
ఏప్రిల్ 21వ తేదీన బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ యువతి తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 21వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఆ యువతి బెంగళూరులోని ఇందిరా నగర్ కు వెళ్లడానికి ర్యాపిడో (Rapido) బైక్ టాక్సీని బుక్ చేసుకున్నారు. 10 నిమిషాల తరువాత వచ్చిన ర్యాపిడో (Rapido) డ్రైవర్ దీపక్ ముందుగా, ఓటీపీ (OTP) ని చూసే నెపంతో ఆమె ఫోన్ ను లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆ తరువాత, ఆమె బైక్ పై కూర్చున్న తరువాత, బుక్ చేసుకున్న గమ్యస్థానానికి వెళ్లే మార్గంలో కాకుండా, వేరే మార్గంలో వెళ్లసాగాడు. అనుమానం వచ్చిన ఆ యువతి పలుమార్లు ఇది సరైన మార్గం కాదని చెప్పినా వినకుండా వేగంగా వెళ్లసాగాడు. మార్గ మధ్యంలో ఆమెతో అనుచితంగా ప్రవర్తించడానికి, ఆమెను అసభ్యకరంగా తాకడానికి ప్రయత్నించాడు. దాంతో, భయాందోళనలకు గురైన ఆ యువతి వేగంగా వెళ్తున్న బైక్ నుంచి కిందకు దూకేసింది. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని హైదరాబాద్ కు చెందిన దీపక్ గా గుర్తించారు. గత ఐదేళ్లుగా బెంగళూరులో ఉంటున్నాడని పోలీసులు వెల్లడించారు. అతడి క్రిమినల్ రికార్డ్ గురించి హైదరాబాద్ పోలీసులను సంప్రదిస్తున్నామన్నారు.
Rapido rider gropes woman: బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరి
ఈ నేపథ్యంలో.. అన్ని కార్ టాక్సీ, బైక్ టాక్సీ, ఫుడ్ డెలివరీ ఎగ్రిగేటర్ ప్రతినిధులతో సమావేశం జరిపి, మహిళల భద్రత విషయంలో పాటించాల్సిన నియమనిబంధనలను కచ్చితంగా పాటించాలని వారికి పోలీసులు హెచ్చరించారు. టాక్సీ, ఫుడ్ డెలివరీ సర్వీసులకు ఎవరినైనా హైర్ చేసుకునే ముందు బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ తప్పని సరిగా చేయాలని సూచించారు. తమ డివిజన్ లో ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రథమమని బెంగళూరు నార్త్ ఈస్ట్ డీసీపీ లక్ష్మి ప్రసాద్ తెలిపారు. టాక్సీ, ఫుడ్ డెలివరీ సర్వీసులకు ఎవరినైనా హైర్ చేసుకునే ముందు బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ తప్పని సరిగా చేయాలని సూచించారు.