Noida crime news : కట్నం కోసం మహిళను చంపి.. పాతేసిన భర్త! శరీరాన్ని పీక్కు తిన్న కుక్కలు
01 April 2023, 8:06 IST
Noida woman buried : పెళ్లై 7ఏళ్లు గడిచినా.. ఆ మహిళ కట్నం వేధింపులకు గురవుతూనే ఉంది. 15 రోజుల క్రితం అదృశ్యమైంది. చివరికి.. ఆమె మృతదేహం లభించింది. కుక్కలు పీక్కు తింటున్న దశలో పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. మహిళ భర్త తరఫు కుటుంబమే.. ఆమెను చంపేసిందని ఆరోపణలు ఉన్నాయి.
కట్నం కోసం మహిళను చంపి.. పాతేసిన భర్త! శరీరాన్ని పీక్కు తిన్న కుక్కలు!
Noida woman buried : గ్రేటర్ నోయిడాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పూడ్చిపెట్టిన ఓ మహిళ మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా.. ఆ మృతదేహం 15 రోజుల క్రితం అదృశ్యమైన తన సోదరిదని ఆమె కుటుంబం చెబుతోంది. కట్నం వేధింపులతో.. మహిళ భర్త తరఫు కుటుంబం.. ఆమెను చంపేసిందని ఆరోపిస్తోంది.
కట్నం కోసం.. చంపేశారా?
టుస్యానా అనే గ్రామానికి చెందిన సరిత అనే మహిళకు 2015లో జోగిందర్తో వివాహం జరిగింది. జోగిందర్ కుటుంబంతో ఆ మహిళ నోయిడాలో నివాసముంటోంది. కాగా.. పెళ్లి సమయంలో కట్నం కింద సరిత కుటుంబం రూ. 10లక్షలతో పాటు ఓ బైక్‌ని కూడా ఇచ్చింది.
Greater Noida crime news : కొంతకాలం తర్వాత సరితకు కట్నం వేధింపులు మొదలయ్యాయి! ఇంకా ఎక్కువ కట్నం ఇవ్వాలని జోగిందర్తో పాటు అతని కుటుంబసభ్యులు సరితను ఒత్తిడి చేశారు. 2021లో ఈ వ్యవహారం తారస్థాయికి చేరింది. ఆ ఏడాది మార్చ్‌లో సరిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కానీ పెద్దలు మధ్యవర్తిత్వం వహించి.. సమస్యను పరిష్కరించారు.
ఆ తర్వాత కూడా సరిత.. కట్నం వేధింపులకు గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. గత నెల 8న సరితకు ఆమె కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. ఫోన్ కలవేలు. జోగిందర్‌ను ప్రశ్నిస్తే.. 'సరిత ఇంట్లో లేదు.. ఆమె పారిపోయింది,' అని సమాధానం లభించింది. జోగిందర్‌పై అనుమానంతో మార్చ్15న పోలీసులను ఆశ్రయించాడు సరిత సోదరుడు నరేందర్ భాటి. జోగిందర్తో పాటు అతని కుటుంబసభ్యుల్లో ఆరుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతదేహం బయటపడింది ఇలా..
Noida woman killed for dowry : కొన్ని రోజుల క్రితం.. గ్రేటర్ నోయిడా పరిసర ప్రాంతాల్లో ఉరుములతో భారీ వర్షాలు పడ్డాయి. శుక్రవారం.. ఓ ఖాళీ స్థలంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కు తినడాన్ని స్థానికులు గుర్తించారు. తొలుత వారికి ఆ మహిళ దుస్తులు కనిపించాయి. ఆ తర్వాత కొన్ని శరీర భాగాలను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఖాళీ స్థలంలో గొయ్యి తవ్వి, ఆ మృతదేహాన్ని పూడ్చినట్టు.. వర్షాల వల్ల అక్కడి మట్టి పోయి, మృతదేహం బయటకు కనిపించినట్టు పోలీసులు నిర్ధరించుకున్నారు.
Noida woman killed and buried : మరోవైపు.. మహిళ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. ఇంతలో.. ఆ మృతదేహం తమ బిడ్డదే అని సరిత తరఫు బంధువులు గుర్తించారు. కుక్కలు పీక్కు తిన్న సరిత మృతదేహాన్ని చూసి విలపించారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అయితే.. పెళ్లి జరిగి 7ఏళ్లు గడిచిపోయాయి కాబట్టి.. నిందితులపై వరకట్నానికి సంబంధించిన కేసులు చెల్లవని అధికారులు చెబుతున్నారు.