తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Npcil Recruitment: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ; గేట్ స్కోర్ చాలు..

NPCIL Recruitment: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ; గేట్ స్కోర్ చాలు..

HT Telugu Desk HT Telugu

12 April 2024, 16:43 IST

    • NPCIL Recruitment through GATE: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలను గేట్ 2022 లేదా గేట్ 2023 లేదా గేట్ 2024 స్కోర్ ల ఆధారంగా భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ..
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ఉద్యోగాల భర్తీ
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ఉద్యోగాల భర్తీ (Shutterstock)

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ఉద్యోగాల భర్తీ

NPCIL Recruitment: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Nuclear Power Corporation of India Limited NPCIL) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గేట్ 2022 (GATE 2022) లేదా గేట్ 2023 (GATE 2023) లేదా గేట్ 2024 (GATE 2024) స్కోర్ ద్వారా పోస్టుల భర్తీ జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్పీసీఐఎల్ అధికారిక వెబ్సైట్ npcilcareers.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Iran President Raisi death : హెలికాప్టర్​ ప్రమాదంలో ఇరాన్​ అధ్యక్షుడు రైసీ మృతి

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

ఏప్రిల్ 30 లాస్ట్ డేట్..

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 10న ప్రారంభమైంది. 2024 ఏప్రిల్ 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (Executive Trainee) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.

ఖాళీల వివరాలు

  • మెకానికల్ : 150 పోస్టులు
  • కెమికల్ : 73 పోస్టులు
  • ఎలక్ట్రికల్ : 69 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్ : 29 పోస్టులు
  • ఇన్ స్ట్రుమెంటేషన్ : 19 పోస్టులు
  • సివిల్ : 60 పోస్టులు

అర్హతలు

బీఈ/బీటెక్ /బీఎస్సీ (ఇంజినీరింగ్ )/5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లో కనీసం 60 శాతం మార్కులతో యూనివర్సిటీ/డీమ్డ్ యూనివర్సిటీ లేదా ఏఐసీటీఈ/యూజీసీ గుర్తింపు పొందిన ఇన్ స్టిట్యూట్ నుంచి మెకానికల్, కెమికల్, సివిల్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ విభాగాల్లో ఏదో ఒక విభాగం నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణత సాధించిన విభాగంలోనే చెల్లుబాటు అయ్యే గేట్-2022 (GATE 2022) లేదా గేట్-2023 (GATE 2023) లేదా గేట్-2024 (GATE 2024) స్కోర్ తప్పనిసరిగా ఉండాలి.

ఎంపిక విధానం

గేట్ 2022, గేట్ 2023, గేట్ 2024 స్కోర్ల ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూ కు 1:12 రేషియోలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. మెడికల్ ఫిట్ నెస్ కు లోబడి పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు

జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ ఫీజు కింద రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, డీవోడీపీకేఐఏ (విధుల్లో ఉండగా మరణించిన త్రివిధ దళాలకు చెందిన సైనికుల కుటుంబ సభ్యులు), మహిళా దరఖాస్తుదారులు, ఎన్ పీసీఐఎల్ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్పీసీఐఎల్ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.

తదుపరి వ్యాసం