NPCIL recruitment: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ట్రైనీ పోస్ట్ లకు నోటిఫికేషన్-npcil to recruit 325 executive trainees through gate score details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Npcil Recruitment: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ట్రైనీ పోస్ట్ లకు నోటిఫికేషన్

NPCIL recruitment: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ట్రైనీ పోస్ట్ లకు నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 07:04 PM IST

NPCIL recruitment: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Nuclear Power Corporation of India Limited NPCIL) లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (Executive Trainee) పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Shutterstock)

NPCIL recruitment: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (Executive Trainee) పోస్ట్ ల భర్తీ కోసం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Nuclear Power Corporation of India Limited NPCIL) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 325 పోస్ట్ లను భర్తీ చేయనుంది. గేట్ 2021 (GATE 2021), గేట్ 2022 (GATE 2022) , గేట్ 2023 (GATE 2023) స్కోర్స్ ఆధారంగా ఈ పోస్ట్ లకు ఎంపిక ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Vacancy Details వేకెన్సీ, సెలెక్షన్ వివరాలు..

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో NPCI అధికారిక వెబ్ సైట్ npcilcareers.co.in. వెబ్ సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు ఏప్రిల్ 11 వ తేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. గేట్ 2021 (GATE 2021), గేట్ 2022 (GATE 2022) , గేట్ 2023 (GATE 2023) స్కోర్స్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా

  • మెకానికల్ (Mechanical) - 123
  • కెమికల్ (Chemical) - 50
  • ఎలక్ట్రికల్ (Electrical) -57
  • ఎలక్ట్రానిక్స్ (Electronics) - 25
  • ఇన్ స్ట్రుమెంటేషన్ (Instrumentation) - 25
  • సివిల్ (Civil) - 45

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు.

Eligibility Criteria అర్హతలు

ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ లకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు విద్యార్హతలు, వయో పరిమితి, రిజర్వేషన్స్ తదితర వివరాల కోసం NPCI అధికారిక వెబ్ సైట్ npcilcareers.co.in. లోని నోటిఫికేషన్ ను పరిశీలించాలి. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే వారిలో ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వారు, జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 500 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

Whats_app_banner