TSNPDCL Recruitment : విద్యుత్ శాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. ఖాళీలు, పరీక్ష తేదీలివే
TSNPDCL Recruitment 2023: ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
TSNPDCL Junior Assistant Recruitment : తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఉద్యోగ ప్రకటన నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ మేరకు ఖాళీలు, అర్హతలు, దరఖాస్తులు, పరీక్ష తేదీలతో పాటు పలు వివరాలను వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.
ముఖ్య వివరాలు :
నియామక సంస్థ - ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ
మొత్తం ఉద్యోగాలు - 100
ఉద్యోగాల పేరు - జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్
సర్కిళ్లు - వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్
అర్హత - ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికెట్ తప్పనిసరి.
వయసు - 2023 జనవరి 1వ తేదీ నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లోనే చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు - రూ.200 (SC, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, పీహెచ్సీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది(రూ. 120))
దరఖాస్తులు ప్రారంభం - ఏప్రిల్ 10, 2023
తుది గడువు- ఏప్రిల్ 29, 2023.
ఎడిట్ ఆప్షన్ - 2023 మే 2 నుంచి 5వ తేదీ వరకు ఎడిట్ చేసుకోవచ్చు.
హాల్టికెట్లు - మే 22, 2023
పరీక్ష తేదీ - మే 28, 2023.
హాల్ టికెట్లతో పాటు మిగతా వివరాల కోసం https://tsnpdcl.in/Careers లింక్ పై క్లిక్ చేయండి.