GATE 2024 scorecard : నేడు గేట్ 2024 స్కోర్ కార్డ్ విడుదల- ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
GATE 2024 scorecard download : గేట్ 2024కి సంబంధించి కీలక అప్డేట్. గేట్ స్కోర్ కార్డ్ నేడు విడుదలవుతుంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
GATE 2024 scorecard release date : గేట్ 2024 స్కోర్ కార్డ్‌ని నేడు, మార్చ్ 23న విడుదల చేయనుంది బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)కు హాజరైన అభ్యర్థులు.. gate2024.iisc.ac.in ఐఐఎస్సీ గేట్ అధికారిక వెబ్సైట్ ద్వారా స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గేట్ 2024 పరీక్షను.. 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో నిర్వహించింది ఐఐఎస్సీ. అభ్యర్థుల సమాధానాలను ఫిబ్రవరి 16న, ఆన్సర్ కీని 2024 ఫిబ్రవరి 19న విడుదల చేసింది. ఇక.. గేట్ 2024 ఫలితాలను మార్చి 16, 2024న ప్రకటించింది.
గేట్ 2024 స్కోర్ కార్డ్- ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
గేట్ 2024 స్కోర్ కార్డ్ ఈ రోజు విడుదలవుతుంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ క్రింద చెప్పిన స్టెప్స్‌ని అనుసరించి స్కోర్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
స్టెప్ 1:- gate2024.iisc.ac.in ఐఐఎస్సీ గేట్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
ఇదీ చూడండి:- TS TET 2024 Updates : ఈసారి మరింత పెంచేశారు..! రూ.1000కి చేరిన 'టెట్' దరఖాస్తు ఫీజు, రెండు పేపర్లు రాస్తే రూ. 2 వేలు
స్టెప్ 2:- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న గేట్ 2024 స్కోర్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.
How to download GATE 2024 scorecard : స్టెప్ 3:- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు అవసరమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 4:- సబ్మీట్ బటన్‌పై క్లిక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోండి.
స్టెప్ 5:- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసుకోండి.
పరీక్షలో అభ్యర్థి ఏ మేరకు ప్రదర్శన చేశాడు? అని తెలియజేస్తుంది ఈ గేట్ స్కోర్ కార్డ్. గేట్ 2024 స్కోర్ కార్డ్.. ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది.
GATE 2024 scorecard date : సమాధానాలను మూల్యాంకణం చేసిన తర్వాత గేట్ స్కోరును లెక్కించడానికి అభ్యర్థి సాధించిన వాస్తవ (రా) మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మల్టీ సెషన్ టెస్ట్ పేపర్లకు, వివిధ సెషన్లలో అభ్యర్థులు పొందిన రా మార్కులను ఆ నిర్దిష్ట పరీక్ష పేపర్‌కు నార్మలైజ్డ్ మార్కులుగా మారుస్తారు. అందువల్ల, అర్హత మార్కుల ఆధారంగా గేట్ స్కోరును లెక్కించడానికి రా మార్కులు (సింగిల్ సెషన్ పేపర్లకు) లేదా నార్మలైజ్డ్ మార్కులు (మల్టీ సెషన్ టెస్ట్ పేపర్లకు) ఉపయోగిస్తారు. మరిన్ని వివరాల తెలుసుకునేందుకు అభ్యర్థులు ఐఐఎస్సీ గేట్ అధికారిక వెబసైట్ని చూడాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం