TS TET 2024 Updates : ఈసారి మరింత పెంచేశారు..! రూ.1000కి చేరిన 'టెట్' దరఖాస్తు ఫీజు, రెండు పేపర్లు రాస్తే రూ. 2 వేలు
TS TET 2024 Exam Updates: తెలంగాణ టెట్ దరఖాస్తు రుసుం భారీగా పెరిగింది. గతంలో ఒక పేపర్ రాస్తే రూ. 200గా ఉంటే… ఈసారి మాత్రం రూ. 1000కి పెరిగింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.
Telangana TET 2024 Updates: తెలంగాణలో మెగా డీఎస్సీ(TS Mega DSC) నోటిఫికేషన్ విడుదలైన వేళ.... టెట్(TS TET 2024) ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 27వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురూ కానుంది. ఇప్పటికే ప్రాథమిక తేదీలను ప్రకటించిన విద్యాశాఖ.... పూర్తి స్థాయి వివరాలను వెల్లడించనుంది. అయితే తెలంగాణ టెట్ 2024 పరీక్షకు సంబంధించి సమాచారాన్ని శుక్రవారం విడుదల చేసింది విద్యాశాఖ. ఇందులో దరఖాస్తు రుసుమును భారీగా పెంచింది. గతంలో ఒక్క పేపర్ రాస్తే రూ. 200 ఉంటే... ఇప్పుడు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. రెండు పేపర్లు రాస్తే రూ. 2000 చెల్లించాలి. https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ఫీజును చెల్లించటంతో పాటు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిర్వహిస్తూ వస్తున్న ప్రతిసారి... అంతో ఇంతో పెంచుతూ వస్తోంది విద్యాశాఖ. ఈసారి కూడా ఏకంగా రూ. 1000కి చేరింది. ఫలితంగా ఈసారి పరీక్ష రాసే అభ్యర్థులు వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత... 2016లో తొలిసారి టెట్ ఎగ్జామ్ నిర్వహించారు. అప్పుడు ఫీజు కేవలం రూ. 200గా ఉంది. ఆ తర్వాత 2017లోనూ అదే ఫీజును కంటిన్యూ చేశారు. ఆ తర్వాత 300 చేశారు. గతేడాది నిర్వహించిన పరీక్షకు సంబంధించి రూ. 400గా నిర్ణయించారు. రెండు పేపర్లకు కలిపి ఈ ఫీజు ఉండేది. కానీ ఈసారి మాత్రం… ఒక్క పేపర్ రాసేందుకే రూ. 1000గా నిర్ణయించారు. రెండు పేపర్లు రాస్తే రెండు వేలు చెల్లించాల్సి ఉంటుంది. భారీగా దరఖాస్తు రుసుం పెంపుపై అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు.
తెలంగాణ టెట్ దరఖాస్తులు మార్చి 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 20 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ తెలిపింది. జూన్ 3వ తేదీతో ఎగ్జామ్స్ ముగుస్తాయని పేర్కొంది. https://tstet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయవచ్చని సూచించింది.
TS TET Key Dates : టీఎస్ టెట్ ముఖ్య తేదీలు:
- తెలంగాణ టెట్ నోటిఫికేషన్ - 04, మార్చి, 2024.
- దరఖాస్తులు ప్రారంభం -మార్చి 27, 2024.
- దరఖాస్తులకు చివరి తేదీ - ఏప్రిల్ 10, 2024.
- హాల్ టికెట్లు - మే 15, 2024.
- పరీక్షలు ప్రారంభం - మే 20, 2024.
- పరీక్షల ముగింపు - జూన్ 06,2024.
- టెట్ ఫలితాలు - జూన్ 12, 2024.
- అధికారిక వెబ్ సైట్ - https://tstet.cgg.gov.in/
తాజాగా టెట్ నోటిఫికేన్ విడుదలైన నేపథ్యంలో…. మరోవైపు డీఎస్సీకి భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో అర్హత సాధిస్తే…. డీఎస్సీ పరీక్షలు రాసే అవకాశం దక్కనుంది. డీఎస్సీ పోస్టుల భర్తీ కోసం మార్చి 4వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా భర్తీ చేయనున్న మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 ఉద్యోగాలు ఉన్నాయి.గతంలో డిఎస్సీ దరఖాస్తు చేసుకున్నవారిని తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. ఏప్రిల్ 2వ తేదీతో డీఎస్సీ దరఖాస్తుల గడువు పూర్తి కానుంది.