TS DSC 2024 Updates : తెలంగాణ డీఎస్సీకి దరఖాస్తు చేశారా..? 'ఎడిట్ ఆప్షన్' వచ్చేసింది, లింక్ ఇదే
TS Mega DSC 2024 Updates : డీఎస్సీ అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ విద్యాశాఖ. డీఎస్సీ దరఖాస్తులను(TS DSC Application) ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ప్రత్యేక ఆప్షన్ ను తీసుకొచ్చింది.
Telangana DSC 2024 Application Edit Option : తెలంగాణ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్(Telangana DSC 2024) వచ్చిన సంగతి తెలిసిందే. గత వారంలో నోటిఫికేషన్ రాగా... మార్చి 4వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు https://tsdsc.aptonline.in/tsdsc/ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి ప్రత్యేకంగా అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. డీఎస్సీ దరఖాస్తులను(TS DSC Applications 2024) ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
TS DSC Application Edit Option: ఎడిట్ ఆప్షన్…
గతంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను(TS DSC Notification 2024) రద్దు చేసి పోస్టులను సంఖ్యను పెంచి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది తెలంగాణ విద్యాశాఖ. 11,062 ఖాళీలను భర్తీ చేయనుంది. అయితే గతంలో కేవలం 5వేలకుపైగా పోస్టులతోనే నోటిఫికేషన్ వచ్చింది. ఫలితంగా పలు జిల్లాల్లో ఖాళీలు లేకుండా పోయాయి. ఫలితంగా చాలా మంది అభ్యర్థులు ఓపెన్ కోటాలో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం పోస్టుల సంఖ్య పెరగటంతో అన్ని జిల్లాల్లోనూ ఖాళీల సంఖ్య పెరిగింది. దీంతో తమకు వెబ్ సైట్ లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చాలా మంది అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో స్పందించిన విద్యాశాఖ… వెబ్ సైట్ లో ఎడిట్ అప్షన్ ను తీసుకొచ్చింది. ఇక ఈ ఎడిట్ ఆప్షన్ ను ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుందని… ఆ తర్వాత ఓపెన్ కాదని విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఎడిట్ ఆప్షన్ లింక్…
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
Click Here for Direct Recruitment of TS DSC - 2024 అనే అప్షన్ పై క్లిక్ చేయాలి.
EDit Post Applied అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి Candidate's Aadhaar No, Payment Reference IDని ఎంట్రీ చేసి సెర్చ్ చేయాలి. దీంతో మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
ఓపెన్ అయిన దరఖాస్తును ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్మాత తిరిగి సబ్మిట్ చేయాలి.ఈ ఎడిట్ ఆప్షన్ ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
తాజాగా భర్తీ చేయనున్న మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 ఉద్యోగాలు ఉన్నాయి.గతంలో డిఎస్సీ దరఖాస్తు చేసుకున్నవారిని తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. తాజా ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా, పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
డిఎస్సీ 2024(TS DSC Exam 2024) ఉద్యోగాల భర్తీని కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) కింది "ఆన్‌లైన్"లో నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. డీఎస్సీ పరీక్షలో జనరల్ నాల్డెజ్, టీచింగ్ తో పాటు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగతా 20 మార్కులకు టెట్(TS TET ) వెయిటేజ్ ఉంటుంది. రాతపరీక్ష తర్వాత టెట్ *(TS TET Exam)వెయిటీజీని కలిపి తుది జాబితాను ప్రకటిస్తారు.