GATE Results 2024 : గేట్ 2024 ఫలితాలు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే, ఆ తేదీ నుంచి స్కోర్ కార్డులు డౌన్లోడ్
GATE 2024 Results : గేట్ - 2024 ఫలితాలు వచ్చేశాయ్. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISc)... శనివారం ఈ రిజల్ట్స్ ను ప్రకటించింది. మార్చి 23 నుంచి స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
GATE Results 2024: బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(The Indian Institute of Science, Bengaluru)…. గేట్ - 2024 ఫలితాలను వెల్లడించింది. శనివారం ఈ ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు IISc GATE అధికారిక వెబ్‌సైట్ gate2024.iisc.ac.in లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చని తెలిపింది.
ఐఐఎస్సీ గేట్ 2024 పరీక్షను ఫిబ్రవరి 03,04,10,11 తేదీల్లో నిర్వహించింది. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను ఫిబ్రవరి 16వ తేదీన అందుబాటులోకి తీసుకురాగా…. ఫిబ్రవరి 19వ తేదీన కీ లను ప్రకటించింది. ప్రాథమిక కీలపై అభ్యర్థులను ఫిబ్రవరి 25వ తేదీ వరకు స్వీకరించింది. మార్చి 15వ తేదీన ఫైనల్ కీ ని ప్రకటించింది.
How to Check GATE Results 2024: గేట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి…
గేట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ కింద సూచిన స్టెప్పుల ఆధారంగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు….
- పరీక్ష రాసిన అభ్యర్థులు గేట్ అధికారిక వెబ్ సైట్ https://gate2024.iisc.ac.in/ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే GATE Result 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
- మీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి ఫలితాల కాపీని పొందవచ్చు.
మార్చి 23 నుంచి స్కోర్ కార్డు…
టాపర్స్ జాబితాతో పాటు కటాఫ్ మార్కుల వివరాలను త్వరలోనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ విడుదల చేయనుంది. ఈ వివరాలను కూడా వెబ్ సైట్ లో ఉంచనుంది. గేట్ ఫలితాలు మార్చి 16వ తేదీన రాగా…. స్కోర్ కార్డులకు(Scorecard) సంబంధించి మరో అప్డేట్ ఇచ్చింది. మార్చి 23వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. అధికారిక వెబ్ సైట్ లోనే స్కోర్ కార్డులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.