IISER Phd Admissions: తిరుపతి ఐఐఎస్‌ఇఆర్‌లో పిహెచ్‌డి ప్రవేశాలకు ఏప్రిల్ 3 వరకు గడువు, గేట్, నెట్ స్కోర్ ఉంటే చాలు…
IISER Phd Admissions: తిరుపతి ఐఐఎస్‌ఇఆర్‌లో పిహెచ్‌డి ప్రవేశాలకు గడువు సమీపిస్తోంది. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
IISER Phd Admissions: తిరుపతిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్‌లో పీహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 3వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. దేశ వ్యాప్తంగా జాతీయ స్థాయిలో నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల స్కోర్ కార్డుల ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

IISER Phd Admissions: తిరుపతిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్‌లో పీహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 3వ తేదీతో గడువు ముగియనుంది. 2024 ఆగష్టులో మొదలయ్యే విద్యా సంవత్సరంలో పీహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల్లో మెరిట్ లిస్ట్, పలు ప్రవేశ పరీక్షల్లో సాధించిన ర్యాంకుల ద్వారా ఎంపిక చేస్తారు.
బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్సెస్ విభాగాల్లో అనుబంధ సబ్జెక్టుల్లో పిహెచ్‌డి కోర్సుల్ని అనుమతిస్తారు.
దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం 55శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీతో పాటు జేజీఈఈబీఐఎల్‌ఎస్ 2023, డీబీటీ జేఆర్‌ఎఫ్, జేఆర్‌ఎఫ్ JRF, ఐసీఎంఆర్ ICMR, యూజీసీ సిఎస్‌ఐఆర్ UGC CSIR, జేఆర్‌ఎఫ్ JRF , ఇన్‌స్పైర్ పిహెచ్‌డి Inspire Phd, ఎన్‌బిహెచ్‌ఎం పిహెచ్‌డి SBHM Phd, గేట్ Gate, నెట్ NET లలో ఏదో ఒక పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. కొన్ని కోర్సుల్లో ఇంజనీరింగ్ డిగ్రీలను కూడా అనుమతిస్తారు.
దరఖాస్తుదారులు Applicants గరిష్టంగా 28ఏళ్లకు మించి వయసు ఉండకూడదు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు ఇవే...
మార్చి 13నుంచి తిరుపతి ఐఐఎస్‌ఈఆర్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది. ఏప్రిల్ 3వరకు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఏప్రిల్ 10వ తేదీకి అటుఇటుగా ప్రకటిస్తారు. మే 7-9వ తేదీల మధ్య అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేసిన వారిలో ఇంటర్వ్యూలకు ఎంపికైన వారి జాబితా ప్రకటిస్తారు. ఇంటర్వ్యూ ఫలితాలు జూన్ 1-7వ తేదీల మధ్య విడుదల చేస్తారు. ఆగష్టు 1వ తేదీ నుంచి పిహెచ్‌డి కోర్సులు ప్రారంభం అవుతాయి.
వివిధ పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలకు కనీస విద్యార్హతలు, ఏఏ అర్హత పరీక్షలను అయా కోర్సులకు అనుమతిస్తారనే వివరాలను ఐఐఎస్‌ఈఆర్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. https://www.iisertirupati.ac.in/admission-phd/ పూర్తి వివరాలు తిరుపతి ఐఐఎస్‌ఈఆర్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.