తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Menstruation Leave: పీరియడ్స్ లీవ్‌పై స్మృతీ ఇరానీ కామెంట్.. నెటిజన్ల స్పందన ఇదీ

Menstruation Leave: పీరియడ్స్ లీవ్‌పై స్మృతీ ఇరానీ కామెంట్.. నెటిజన్ల స్పందన ఇదీ

Sharath Chitturi HT Telugu

15 December 2023, 9:00 IST

    • Paid leave policy : నెలసరిలో మహిళలకు పెయిడ్​ లీవ్స్​ ఇచ్చే విషయంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. నెటిజన్ల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్మృతి ఇరానీ ‘పెయిడ్​ లీవ్స్​’ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన ఇది..
స్మృతి ఇరానీ ‘పెయిడ్​ లీవ్స్​’ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన ఇది.. (HT_PRINT)

స్మృతి ఇరానీ ‘పెయిడ్​ లీవ్స్​’ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన ఇది..

Smriti Irani on Paid leave policy : పెయిడ్​ లీవ్స్​పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు.. సామాజిక మాధ్యమాల్లో హాట్​టాపిక్​గా మారాయి. నెలసరి అనేది వైకల్యం కాదని, మహిళలకు పెయిడ్​ లీవ్స్​ అవసరం లేదని ఆమె చేసిన వ్యాఖ్యలు వార్తలకెక్కాయి.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

'పెయిడ్​ లీవ్స్​ అవసరం లేదు..!'

ప్రస్తుతం పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. మహిళల నెలసరి సమయంలో సంస్థలు వారికి కచ్చితమైన సెలవులు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటోందా? అని ఆర్​జేడీ ఎంపీ మనోజ్​ కుమార్​ ఝా ప్రశ్నించారు. ఇందుకు బదులిచ్చారు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ.

Smriti Irani on menstruation : "నెలసరి అనేది వైకల్యం కాదు. మహిళ జీవితంలో ఇది సాధారణమైన విషయం. ఈ ఒక్క విషయాన్ని పరిగణలోకి తీసుకుని నెలసరి అవుతున్న మహిళలను, నెలసరి ఆగిపోయిన మహిళలను వేరుగా చూడకూడదు. అందుకే.. నెలసరి సమయంలో మహిళలకు ప్రత్యేకమైన పెయిడ్​ లీవ్స్​ అవసరం లేదు," అని వ్యాఖ్యానించారు స్మృతి ఇరానీ.

స్మృతి ఇరానీ వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

"స్మృతి ఇరానీ కరెక్ట్​గా చెప్పారు. ఇలా పెయిడ్​ లీవ్స్​ ఇస్తే, మహిళా ఉద్యోగులకే ప్రతికూలం. రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​లో సంస్థలు వారిని దూరం పెట్టే అవకాశం ఉంటుంది," అని ఓ వ్యక్తి ట్విట్టర్​లో కామెంట్​ చేశారు.

Smriti Irani latest news : "నెలసరి సమయంలో మహిళలకు పెయిడ్​ లీవ్స్​ కావాలని పురుషులు అభిప్రాయపడకూడదు. ఉద్యోగం విషయంలో దేశంలో ఇప్పటికే పురుషులు- మహిళ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇలా పెయిడ్​ లీవ్స్​ ఇస్తే.. మహిళలకు ఉద్యోగావకాశాలు పడిపోతాయి," అని మరో వ్యక్తి రాసుకొచ్చారు.

"నెలసరి పేరుతో పెయిడ్​ లీవ్స్​ ఇవ్వకూడదు. నేను మహిళలకు వ్యతిరేకం కాదు. కానీ ఇలా లీవ్స్​ ఇస్తే.. రిక్రూట్​మెంట్​లో కష్టం అవుతుంది," అని మరో వ్యక్తి పేర్కొన్నాడు.

అయితే.. కొందరు స్మృతి ఇరానీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు కూడా!

Paid leave policy Smriti Irani : "నెలసరి అనేది వైకల్యం కాదు. వారికి పెయిడ్​ లీవ్స్​ అక్కర్లేదన్నారు సరే! మరి మెటర్నిటీ లీవ్స్​ ఎందుకిస్తున్నారు? పిల్లలను డెలివరీ ఇవ్వడం అనేది వైకల్యమా? అది సహజమైన ప్రక్రియ కాదా? మీ అంత విశాలవంతమైన జీవితం చాలా మందికి ఉండదు. చాలా నొప్పులు పడి ఉద్యోగం చేయాల్సి వస్తుంది," అని ఓ మహిళ ట్విట్టర్​లో పేర్కొంది.

"స్మృతి ఇరానీ వ్యాఖ్యలను నేను వ్యతిరేకిస్తున్నా. చాలా షాకింగ్​గా ఉంది. నెలసరి అనేది సీరియస్​ విషయం కాదని మీరు ఎలా అనగలరు? ఈ విషయంపై వస్తున్న రీసెర్చ్​ డేటాను చూశారు అసలు? పీఎంఎస్​, పీసీఓఎస్​, పీసీఓడీ, మూడ్​ స్వింగ్స్​, మెంటల్​ స్ట్రెస్​ గురించి మీకు ఏమైనా తెలుసా? ఇంత నొప్పిలోనూ.. అటు ఇంటి పని, ఇటు ఆఫీస్​ పని చేసుకోవాల్సి వస్తోంది," అని మరో మహిళ రాసుకొచ్చింది.

మరి మీరేం అంటారు? నెలసరి సమయంలో మహిళలకు పెయిడ్​ లీవ్స్​ అవసరం ఉందా? లేదా?

తదుపరి వ్యాసం