NEET exam dates: నీట్ ఎండీఎస్, ఎస్ఎస్, డీఎన్బీ, తదితర పరీక్షల తేదీలు విడుదల
27 November 2024, 16:59 IST
NEET exam dates: 2025లో నిర్వహించే వివిధ పరీక్షల తాత్కాలిక క్యాలెండర్ ను ఎన్బీఈఎంఎస్ (NBEMS) ప్రకటించింది. అభ్యర్థులు ఆయా తేదీలను అధికారిక వెబ్ సైట్ natboard.edu.in లో చెక్ చేసుకోవచ్చు. అయితే, ఇవి తాత్కాలికంగా నిర్ణయించిన తేదీలు మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
నీట్ ఎండీఎస్, ఎస్ఎస్, డీఎన్బీ, తదితర పరీక్షల తేదీలు విడుదల
NEET exam dates: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ ఆఫ్ డెంటల్ సర్జరీ (నీట్ ఎండీఎస్ 2025) జనవరి 31న నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) బుధవారం ప్రకటించింది. నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్ష (నీట్ ఎస్ఎస్ 2025) మార్చి 29, 30 తేదీల్లో జరుగుతుందని బోర్డు ప్రకటించింది. నీట్ పీజీ మినహా వచ్చే ఏడాది జరగనున్న వివిధ పోటీ పరీక్షల తేదీలను పేర్కొంటూ ఎన్బీఈఎంఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ ను ప్రకటించింది.
నీట్ పీజీ మినహా అన్ని పరీక్షల తేదీలు
నీట్ పీజీ 2025 తేదీని త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. ఈ తేదీలు తాత్కాలికమైనవని, పరిస్థితులను బట్టి తరువాత మార్చవచ్చని స్పష్టం చేసింది. ‘‘పైన పేర్కొన్న తేదీలు పూర్తిగా తాత్కాలికమైనవి. అవి అనుమతులు, ఇతర ధృవీకరణలకు లోబడి ఉన్నందున అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ బులెటిన్లు / ఎన్బిఇఎంఎస్ వెబ్సైట్ నుండి పై పరీక్షల ఖచ్చితమైన తేదీలను తరచూ చెక్ చేసుకోవాలని ఎన్బీఈఎంఎస్ సూచించింది. ఈ పరీక్షలకు సంబంధించిన సమాచార బులెటిన్లు, దరఖాస్తు ఫారాలు, ఇతర వివరాల కోసం అభ్యర్థులు తమ అధికారిక వెబ్సైట్ natboard.edu.in ను చూడాలని కోరింది. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ డిసెంబర్ 2024), ఎన్బీఈఎంఎస్ డిప్లొమా ఫైనల్ థియరీ ఎగ్జామినేషన్ - డిసెంబర్ 2024 తేదీలను ఇప్పటికే ప్రకటించారు.
వివిధ నీట్ పరీక్షలకు తాత్కాలిక తేదీలు
- బీడీఎస్ గ్రాడ్యుయేట్లకు ఫారిన్ డెంటల్ స్క్రీనింగ్ టెస్ట్ (ఎఫ్డీఎస్టీ) 2024: జనవరి 12, 2025
- ఎఫ్ఎన్బీ కోర్సులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్ (ఎఫ్ఏటీ) - 2023 అడ్మిషన్ సెషన్: జనవరి 12
- డీఎన్బీ (బ్రాడ్ స్పెషాలిటీ) ఫైనల్ ప్రాక్టికల్ పరీక్షలు - అక్టోబర్ 2024: జనవరి/ ఫిబ్రవరి
- డీఆర్ఎన్బీ (సూపర్ స్పెషాలిటీ) ఫైనల్ థియరీ పరీక్షలు - జనవరి 2025: జనవరి 17, 18, 19
- నీట్-ఎండీఎస్ 2025: జనవరి 31
- ఎన్బీఈఎంఎస్ డిప్లొమా ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ - డిసెంబర్ 2024: ఫిబ్రవరి లేదా మార్చి
- ఎండీఎస్, పీజీ డిప్లొమా గ్రాడ్యుయేట్లకు ఫిబ్రవరి/ మార్చి ఎఫ్డీఎస్టీ 2024: ఫిబ్రవరి 9
- ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ 2024: ఫిబ్రవరి 16
- డీఎన్బీ -పోస్ట్ డిప్లొమా సెంట్రలైజ్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (పీడీసెట్ 2025) : ఫిబ్రవరి 23
- డీఆర్ ఎన్ బీ (సూపర్ స్పెషాలిటీ) ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ - జనవరి 2025: మార్చి/ ఏప్రిల్/ మే
- నీట్-ఎస్ఎస్ 2024: మార్చి 29, 30 తేదీల్లో
- నీట్-పీజీ 2025: త్వరలో ప్రకటిస్తారు.
- నీట్ (neet) పరీక్షలకు సంబంధించి ఏదైనా సందేహాలు, వివరణ లేదా సహాయం కోసం ఎన్ బీఈఎంఎస్ కు కమ్యూనికేషన్ వెబ్ పోర్టల్ ద్వారా సంప్రదించవచ్చు.