KNRUHS Notification : మెడికల్ విద్యార్థులకు అలర్ట్.. పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్.. ఈ లింక్ ద్వార అప్లై చేసుకోండి-kaloji narayana rao health university notification released for pg seats ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Knruhs Notification : మెడికల్ విద్యార్థులకు అలర్ట్.. పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్.. ఈ లింక్ ద్వార అప్లై చేసుకోండి

KNRUHS Notification : మెడికల్ విద్యార్థులకు అలర్ట్.. పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్.. ఈ లింక్ ద్వార అప్లై చేసుకోండి

Basani Shiva Kumar HT Telugu
Oct 31, 2024 10:43 AM IST

KNRUHS Notification : కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. మెడికల్ పీజీ సీట్ల భర్తీ కోసం వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. https://tspgmed.tsche.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అక్టోబర్ 31 నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు.

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ

తెలంగాణలో మెడికల్‌ పీజీ, డిప్లొమా కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ సీట్ల భర్తీ కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్‌ పీజీలో అర్హత సాధించిన అభ్యర్థులు.. అక్టోబరు 31 నుంచి నవంబరు 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ అధికారులు సూచించారు.

హెల్త్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ https://tspgmed.tsche.in ద్వారా అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్హత, కమ్యూనిటీ సహా అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేశారు. దరఖాస్తులను పరిశీలించి.. మెరిట్‌ జాబితా విడుదల చేస్తామని వర్సిటీ అధికారులు వివరించారు. మెరిట్ లిస్టు ప్రకటించిన తర్వాత వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.

యునాని, ఎండీ ఆయుర్వేద, హోమియో కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. బుధవారం సాయంత్రం 4 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 5వ తేదీ సాయంత్రం 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వివరించారు. వీటి కోసం అప్లై చేసే సమయంలో సందేహాలొస్తే 9392685856, 7842136688, 9059672216 నంబర్లకు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు.

తెలంగాణ విద్యార్థులే అర్హులు..

మెడికల్‌ పీజీ సీట్లలో స్థానిక కోటా కింద తెలంగాణ విద్యార్థులే అర్హులని యూనివర్సిటీ స్పష్టం చేసింది. పదేళ్లుగా అమలవుతున్న 15 శాతం అన్‌రిజర్వుడ్‌ కోటాను ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో ఆల్ ఇండియా కోటాలో 50 శాతం సీట్లు పోనూ.. మిగిలిన సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి.

గడువు పొడగింపు..

నల్గొండ జిల్లా చలకుర్తి క్యాంపులోని జవహర్ నవోదయ విద్యాలయం అధికారులు కీలక ప్రకటన చేశారు. 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 9, 11వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్టు వెల్లడించారు. నవంబరు 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం 8వ తరగతి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.

Whats_app_banner