తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kota Suicide: రాజస్తాన్ లోని కోటాలో నీట్ కు ప్రిపేర్ అవుతున్న మరో విద్యార్థి ఆత్మహత్య

Kota suicide: రాజస్తాన్ లోని కోటాలో నీట్ కు ప్రిపేర్ అవుతున్న మరో విద్యార్థి ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu

Published Jun 06, 2024 01:02 PM IST

google News
  • Kota suicides: రాజస్తాన్ లోని కోటా లో ఐఐటీ, నీట్ లకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. బుధవారం కోటలోని జవహర్ నగర్ ప్రాంతంలో తన తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తున్న విద్యార్థిని గత ఏడాది నుంచి నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతోంది.

కోటా లో మరో విద్యార్థిని ఆత్మహత్య

కోటా లో మరో విద్యార్థిని ఆత్మహత్య

Kota suicides: అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు ప్రిపేర్ అవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్తాన్ లోని కోటా జిల్లాలో చోటుచేసుకుంది. కోటాలో కోచింగ్ కోసం వచ్చిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఈ సంవత్సరం 10 కి చేరాయి.


మధ్యప్రదేశ్ నుంచి..

మధ్యప్రదేశ్ లోని రేవా నుంచి తన తల్లి, సోదరుడితో కలిసి రాజస్తాన్ లోని కోటా కు వచ్చిన ఆ యువతి గత సంవత్సరం నుంచి నీట్ కు ప్రిపేర్ అవుతోంది. కోటలోని జవహర్ నగర్ ప్రాంతంలో తన తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తోంది. 11వ తరగతి చదువుతున్న ఆమె సోదరుడు కూడా జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడు. 2024 సంవత్సరం నీట్ ఫలితాలను ఒక రోజు ముందే ప్రకటించారు.

కిటికీ నుంచి కిందకు దూకి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం విద్యార్థిని తల్లి గదిలో నిద్రిస్తోంది. సాయంత్రం 4 గంటల సమయంలో బహుళ అంతస్తుల భవనంలోని తన ఫ్లాట్ కిటికీ నుంచి ఆ యువతి కిందకు దూకింది. చుట్టుపక్కల వారు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మీకు మానసికంగా మద్దతు అవసరమైతే లేదా మానసికంగా సహాయం అవసరమైన వారు ఎవరైనా ఉంటే, మీ సమీప మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

హెల్ప్ లైన్లు: ఆస్రా: 022 2754 6669;

స్నేహ ఇండియా ఫౌండేషన్: +914424640050 అండ్ సంజీవని: 011-24311918,

రోష్ని ఫౌండేషన్ (సికింద్రాబాద్) కాంటాక్ట్ నెంబర్లు: 040-66202001, 040-66202000,

వన్ లైఫ్: కాంటాక్ట్ నెంబర్: 78930 78930, సేవ: కాంటాక్ట్ నెంబర్: 09441778290

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.