తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : హనీమూన్​ విషయంలో విభేదాలు- వరుడిపై వధువు తండ్రి యాసిడ్​ దాడి..!

Crime news : హనీమూన్​ విషయంలో విభేదాలు- వరుడిపై వధువు తండ్రి యాసిడ్​ దాడి..!

Sharath Chitturi HT Telugu

21 December 2024, 6:02 IST

google News
  • Mumbai acid attack : ముంబైలో ఓ వ్యక్తిపై యాసిడ్​ దాడి జరిగింది! హనీమూన్​ విషయంలో భిన్న అభిప్రాయాల నేపథ్యంలో వరుడిపై వధువు తండ్రి యాసిడ్​ పోశాడు!

వరుడిపై వధువు కుటుంబం యాసిడ్​ దాడి!
వరుడిపై వధువు కుటుంబం యాసిడ్​ దాడి!

వరుడిపై వధువు కుటుంబం యాసిడ్​ దాడి!

ముంబైలో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది.​ హనీమూన్​ విషయంలో భిన్న అభిప్రాయాలు, గొడవల నేపథ్యంలో వరుడిపై, వధువు తండ్రి యాసిడ్​ దాడి చేశాడు! ప్రస్తుతం బాధితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇదీ జరిగింది..

గత బుధవారం రాత్రి జరిగింది ఈ ఘటన. 29ఏళ్ల ఇబాద్ అతిక్ ఫాల్కే తన కొత్త వధువుతో కాశ్మీర్​ను సందర్శించాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఇది ఆమె కుటుంబ సభ్యుల అసంతృప్తికి కారణమైంది. వారు మక్కాకి వెళ్లమని సూచించినట్టు తెలుస్తోంది. ఈ వివాదం చివరకు ఘర్షణగా మారడంతో గులాం ముర్తజా ఖోటాల్ తన అల్లుడిపై యాసిడ్ పోశాడు!

హనీమూన్ ప్రణాళికలపై వివాదం చెయ్యి దాటిపోయింది. ఫాల్కేతో తన కుమార్తె వివాహాన్ని కట్​ చేసుకోవాలని ఖోటాల్ భావించాడు. బెదిరించే వరకు వెళ్లాడు. చివరికి యాసిడ్​ దాడి చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాం,” అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఫాల్కే బుధవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా థానేలోని కల్యాణ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పార్క్ చేసిన కారు సమీపంలో ఆతనిపై దాడి జరిగిందని, యాసిడ్ దాడిలో ముఖం, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. 

అతని పరిస్థితి విషమంగా ఉండగా ఖోతాల్ అక్కడి నుంచి పరారయ్యాడు.

బాధితుడి పరిస్థితి విషమం..!

బజార్ పేట్ పోలీస్ స్టేషన్ పంచుకున్న అప్​డేట్స్ ప్రకారం.. బాధితుడి ముఖం, శరీరంలోని పలు చోట్ల గాయాలయ్యాయి. ప్రస్తుతం వాటికి చికిత్స పొందుతున్నాడు. యాసిడ్​ దాడి అనంతరం అతని పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

పోలీసులు ఖోతాల్​పై భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యాసిడ్ దాడి గాయాలకు సంబంధించిన సెక్షన్ 124-1, నేరపూరిత బెదిరింపులను వివరించే సెక్షన్ 351-3 వంటి కేసులు వేశారు.

ఈ వార్త సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. హనీమూన్​ విషయంలో గొడవతో యాసిడ్​ దాడి జరిగిందని విని అందరు షాక్​కి గురవుతున్నారు. "అభిప్రాయ భేదాలు ఎంత బలంగా ఉన్నా, ఈ రకమైన అనాగరిక ప్రవర్తనను సమర్థించకూడదు," అని ఒక నెటిజన్ రాసుకొచ్చారు.

తదుపరి వ్యాసం