CBSE new syllabus : సీబీఎస్ఈ సిలబస్‌లో భారీ మార్పులు.. మొఘల్స్‌తో పాటు ఇక ఆ పాఠాలు ఔట్!
04 April 2023, 7:19 IST
- CBSE new syllabus class 12 : హిస్టరీ, పొలిటికల్ సైన్స్‌లోని పలు కీలక పాఠాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఎన్సీఈఆర్టీ. ఫలితంగా.. మొఘల్స్ వంటి పాఠాలు ఇక సీబీఎస్ఈ క్లాస్ 12 పుస్తకాల్లో కనిపించవు.
సీబీఎస్ఈ క్లాస్ 12 సిలబస్ నుంచి మొఘల్స్ ఔట్.. ఇకపై ఆ పాఠాలు ఉండవు!
CBSE new syllabus class 12 : మొఘల్ చక్రవర్తుల చరిత్రకు సంబంధించిన పాఠాలు ఇక సీబీఎస్ఈ క్లాస్ 12, యూపీ బోర్డు సిలబస్‌లలో కనిపించవు! ఈ మేరకు.. హిస్టరీ కర్రికులమ్‌ను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.. కేంద్ర- రాష్ట్ర విద్యా సంస్థల అడ్వైజరీ ఎన్సీఈఆర్టీ.
ఈ పాఠాలు కట్..!
ఎన్సీఈఆర్టీ తాజా నిర్ణయంతో 'కింగ్స్ అండ్ క్రానికల్స్', 'ది మొఘల్ కోర్ట్' వంటి ఛాప్టర్లు ఇకపై సీబీఎస్ఈ క్లాస్ 12 మెడీవియల్ హిస్టరీ టెక్స్ బుక్స్‌లో ఉండవు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థకు ఓ ఉన్నతాధికారి వివరించారు.
CBSE new syllabus 2023- 2024 : మరోవైపు.. ఎన్సీఈఆర్టీ క్లాస్ 12 హిస్టరీ టెక్స్ట్‌బుక్స్‌ను ఫాలో అవ్వాలని ఉత్తర్ ప్రదేశ్ ఎడ్జ్యుకేషన్ బోర్డు నిర్ణయం తీసుకోవడంతో.. అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మొఘల్స్ చరిత్రకు సంబంధించిన పాఠాలు ఉండవు.
"మా విద్యార్థులకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చూసి చదువు చెబుతాము. అందులో ఏముంటే అదే చెప్పాలి కదా," అని ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ మీడియాకు వివరించారు.
పొలిటికల్ సైన్స్ పాఠాల్లో కూడా మార్పులు..
CBSE class 12 syllabus news today : మరోవైపు సీబీఎస్ఈ క్లాస్ 12 పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. దేశంలో సోషలిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన 'రైజ్ ఆఫ్ పాప్యులర్ మూమెంట్స్', స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్ పాలనకు చెందిన 'ఎరా ఆఫ్ వన్ పార్టీ డామినెన్స్' వంటి ఛాప్టర్లను తొలగించారు.
క్లాస్ 10, 11 సిలబస్‌లలోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. 'డెమొక్రసీ అండ్ డైవర్సిటీ', 'పాప్యులర్ స్ట్రగుల్స్ అండ్ మూవ్మెంట్స్' వంటి పాఠాలను క్లాస్ 10 పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి తప్పించారు. 'సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్', 'కాన్ఫ్రెంట్రేషన్ ఆఫ్ కల్చర్స్' వంటి పాఠాలను సీబీఎస్ఈ క్లాస్ 11 హిస్టరీ పుస్తకాల నుంచి తొలగించారు.
CBSE syllabus latest news : సిలబస్‌లో చోటుచేసుకున్న మార్పులు 2023-24 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయని ఎన్సీఈఆర్టీకి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.