CBSE Admit Card: సీబీఎస్సీ 10, 12 విద్యార్థులకు అలర్ట్; అడ్మిట్ కార్డ్స్ రెడీ
08 January 2024, 20:30 IST
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి.
ప్రతీకాత్మక చిత్రం
CBSE Admit Card 2023: 2023వ సంవత్సరానికి గానూ 10, 12 వ తరగతుల ఫైనల్ బోర్డ్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ (Admit Cards) ను సీబీఎస్సీ (Central Board of Secondary Education CBSE) బుదవారం విడుదల చేసింది. సీబీఎస్సీ అధికారిక వెబ్ సైట్ cbse.gov.in. నుంచి ఆయా స్కూల్స్ ఈ అడ్మిట్ కార్డ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
CBSE Admit Card 2023: పరీక్షలు ఎప్పుడు
సీబీఎస్సీ (CBSE)10వ తరగతి, 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల్లో ప్రారంభమవుతున్నాయి. సీబీఎస్సీ (CBSE) అధికారిక వెబ్ సైట్ cbse.gov.in. లో ఈ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల అడ్మిట్ కార్డ్ (CBSE Admit Card 2023) లో విద్యార్థి పేరు, రోల్ నెంబర్, పుట్టిన రోజు, తండ్రి పేరు, పరీక్ష పేరు, తల్లి పేరు, పరీక్ష కేంద్రం తదితర వివరాలుంటాయి. అలాగే, ఏ పరీక్ష ఏ రోజు ఉంటుందో, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుందో ఆ వివరాలు కూడా ఉంటాయి.
CBSE Admit Card 2023: అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?
- అడ్మిట్ కార్డు (CBSE Admit Card 2023) ను డౌన్ లోడ్ చేసుకోవడం కోసం ముందుగా సీబీఎస్సీ (CBSE) అధికారిక వెబ్ సైట్ cbse.gov.in. కు వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే పరీక్ష సంగం (Pariksha Sangam) లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ స్కూల్స్ పేర్లతో కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. తమ స్కూల్ లింక్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
- ప్రి ఎగ్జామ్ యాక్టివిటీస్ (pre exam activities) లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ కనిపిస్తున్న సీబీఎస్సీ అడ్మిట్ కార్డ్ 2023 (CBSE Admit Card 2023) లింక్ పై క్లిక్ చేయాలి.
- ఆ తరువాత లాగిన్ డిటైల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాలి.
- అడ్మిట్ కార్డు (CBSE Admit Card 2023) స్క్రీన్ పై కనిపిస్తుంది.
- ఆ అడ్మిట్ కార్డ్ లోని వివరాలను చెక్ చేసుకుని, ఆ తరువాత డౌన్ లోడ్ చేసుకోవాలి.
- ఎగ్జామ్ హాల్లో చూపించడం కోసం, ఇతర భవిష్యత్ అవసరాల కోసం ఆ అడ్మిట్ కార్డు (CBSE Admit Card 2023)ను ప్రింట్ తీసుకోవాలి.
- Direct link for CBSE Admit Card 2023