CBSE practical exams : నేటి నుంచే సీబీఎస్ఈ 10, 12 ప్రాక్టికల్ పరీక్షలు
CBSE practical exams : సీబీఎస్ఈ 10, 12 తరగతుల ప్రాక్టికల్ పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 14 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పూర్తి వివరాలు..
CBSE practical exams begin today : సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్జ్యూకేషన్) ప్రాక్టికల్ పరీక్షలు నేడు ప్రారంభంకానున్నాయి. 10, 12 తరగతుల విద్యార్థులకు ఫిబ్రవరి నెల 14 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు, ప్రాజెక్ట్, ఇంటర్నల్ అసెస్మెంట్కు సంబంధించిన వివరాలను విద్యార్థులు.. సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ www.cbse.gov.in లో తెలుసుకోవచ్చు.
విద్యార్థుల మార్కులు, గ్రేడ్స్‌ను సోమవారం నుంచి ఫిబ్రవరి 14వ తేదీ మధ్యలో అప్లోడ్ చేస్తుంది సీబీఎస్ఈ. 2022-23 ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను రాయని విద్యార్థులను సిస్టెమ్లో 'ఆబ్సెంట్'గా మార్క్ చేస్తామని సీబీఎస్ఈ వెల్లడించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం 'రిషెడ్యూల్డ్' అని మార్క్ చేస్తామని స్పష్టం చేసింది.
CBSE class 10th practical exams : "పరీక్ష రాసిన కొన్ని రోజుల్లోనే ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్, ఇంటర్నల్ అసెస్మెంట్ ఫలితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాము. ఫిబ్రవరి 14వ తేదీలోగా మార్కుల అప్లోడింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. పరీక్షల తేదీలను పొడగించే ఉద్దేశం బోర్డుకు లేదు," అని ఓ అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది సీబీఎస్ఈ.
2023 10,12 తరగతుల పరీక్షలకు సంబంధించిన డేట్ షీట్‌ను ఇప్పటికే విడుదల చేసింది సీబీఎస్ఈ. పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలవుతాయి. జేఈఈ మెయిన్స్ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని డేట్ షీట్‌ను రూపొందించింది సీబీఎస్ఈ.
CBSE class 12 practical exams : షెడ్యూల్ ప్రకారం.. సీబీఎస్ఈ క్లాస్ 10 పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై.. మార్చ్ 21వరకు జరుగుతాయి. ఇక ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై.. ఏప్రిల్ 5 వరకు సాగుతాయి.
10వ తరగతి పరీక్షలు- ఉదయం 10:30- మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి. విద్యార్థులు.. నిర్ణిత సమయాని కన్నా 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లాలి. క్వశ్చన్ పేపర్‌ను 15 నిమిషాల ముందే ఇచ్చే వెసులుబాటును కల్పించింది సీబీఎస్ఈ.
సంబంధిత కథనం