CBSE Board Exams 2023 Time Table: సీబీఎస్సీ10, 12 క్లాసెస్ ఎగ్జామ్ టైమ్ టేబుల్
CBSE Board Exams 2023 Time Table: సీబీఎస్సీ 10, 12 తరగతుల ఫైనల్ ఎగ్జామ్ టైమ్ టేబుల్ వచ్చేసింది. పరీక్ష తేదీ, పరీక్ష్ సమయాలు, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను సీబీఎస్సీ వెబ్ సైట్ cbse.gov.in. లో చెక్ చేసుకోండి..
CBSE Board Exams 2023 Time Table: 10వ తరగతి, 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ టైమ్ టేబుల్ ను సీబీఎస్సీ(CBSE) గురువారం విడుదల చేసింది. పదవ తరగతి లేదా సెకండరీ ఎగ్జామినేషన్ పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే, 12వ తరగతి లేదా సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ పరీక్షలు ఫిబ్రవరి 15 న ప్రారంభమై ఏప్రిల్ 5వ తేదీన ముగుస్తాయి.
CBSE Board Exams 2023 Time Table: ఇవే పూర్తి వివరాలు..
సీబీఎస్సీ 10వ, 12వ తరగతి ఫైనల్ పరీక్షల టైమ్ టేబుల్ వచ్చేసింది. 10వ తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభమవుతాయి. పరీక్ష ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతాయి. అలాగే, సీబీఎస్సీ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్ష సమయం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటుంది. ఒకే రోజు రెండు సబ్జెక్టుల పరీక్షలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని సీబీఎస్సీ తెలిపింది. పరీక్షలకు, ఇతర నిబంధనలకు సంబంధించి పూర్తి వివరాలను సీబీఎస్సీ వెబ్ సైట్ cbse.gov.in.లో విద్యార్థులు కూలంకశంగా చదువుకోవాలని సీబీఎస్సీ సూచించింది.