CBSE Board Exams 2023:సీబీఎస్సీ క్లాస్ 12 ఎగ్జామ్ డేట్స్ మారాయి.. చెక్ చేసుకోండి-cbse board exams 2023 class 12 datesheet revised new timetable at cbsegovin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse Board Exams 2023:సీబీఎస్సీ క్లాస్ 12 ఎగ్జామ్ డేట్స్ మారాయి.. చెక్ చేసుకోండి

CBSE Board Exams 2023:సీబీఎస్సీ క్లాస్ 12 ఎగ్జామ్ డేట్స్ మారాయి.. చెక్ చేసుకోండి

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 09:44 PM IST

CBSE Board Exams 2023: 10వ తరగతి, 12వ తరగతి బోర్డ్ పరీక్షల తేదీలను సీబీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. అయితే, తాజాగా, 12వ తరగతికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ లో కొన్ని మార్పులు చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

CBSE Board Exams 2023: సీబీఎస్సీ (Central Board of Secondary Education CBSE)12వ తేదీ పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చేసింది. కొత్త టైమ్ టేబుల్ సీబీఎస్సీ అధికారిక వెబ్ సైట్ cbse.gov.in. లో అందుబాటులో ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ cbse.gov.in. వెబ్ సైట్ లో ఒకసారి రివైజ్డ్ టైమ్ టేబుల్ ను సరి చూసుకోవడం ఉత్తమం.

CBSE Board Exams 2023: 12వ తరగతి పరీక్ష తేదీల్లో మార్పులు

సవరించిన టైమ్ టేబుల్ ప్రకారం. .ఏప్రిల్ 4వ తేదీన జరగాల్సిన 12వ తరగతి పరీక్షలను మార్చి 27వ తేదీకి మార్చారు. సవరించిన టైమ్ టేబుల్ ను సీబీఎస్సీ అధికారిక వెబ్ సైట్ cbse.gov.in. లో చూడవచ్చు. 10వ తరగతి పరీక్షల తేదీలలో ఎలాంటి మార్పులు లేవు. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతాయి. మార్చి 21వ తేదీన ముగుస్తాయి. క్లాస్ 12 పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై, ఏప్రిల్ 5 వరకు కొనసాగుతాయి. పరీక్ష సమయం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు ఉంటుంది. విద్యార్థులు పరీక్ష పత్రం చదువుకోవడం కోసం 15 నిమిషాల అదనపు సమయం ఇస్తారు. పూర్తి వివరాలను విద్యార్థులు cbse.gov.in. వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

Whats_app_banner

టాపిక్