Modi 3.0 Cabinet : మోదీ 3.0 కేబినెట్ ఇదే.. బీజేపీ వద్దే కీలక బాధ్యతలు!
09 June 2024, 21:50 IST
- Modi 3.0 Cabinet details : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ, ఎన్డీఏ పక్ష ఎంపీలు.. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవంలో మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు.
మోదీ 3.0 కేబినెట్ ఇదే..
Modi 3.0 cabinet news : దిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార మహోత్సవం అత్యంత అట్టహాసంగా సాగింది. తొలుత ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం.. వివిధ బీజేపీ- ఎన్డీఏ పక్ష ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
మోదీ 3.0 కేబినెట్ ఇదే..
రాష్ట్రపతి భవన్లో ఆదివారం సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు.. ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలైంది. మోదీ ప్రమాణం చేస్తున్న సమయంలో.. ‘మోదీ-మోదీ’ నినాదాలతో ఆ ప్రాంగణం మారుమోగిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అనంతరం.. వేదికపై కూర్చున్న ఎంపీలు ఒక్కొక్కరుగా వచ్చి ప్రమాణం చేశారు.
మోదీ అనంతరం.. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జైశంకర్‌లు.. మంత్రులగా బాధ్యతలు చేపట్టారు. పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, శర్వానంద్ సోనోవాల్, వీరేంద్ర కుమార్, ప్రహ్లాద్ జోషీ, గిరిరాజ్ సింగ్, ఆశ్వణి వైష్ణవ్‌లు, జ్యోతిరాధిత్య సింథియా, గజేంద్ర సింగ్ షేకావత్, అన్నపూర్ణ దేవీ, కిరణ్ రిజిజు, హార్దీప్ సింగ్ పూరి, మన్సుఖ్ మాండవీయ, డా. జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్.. మోదీ 3.0 కేబినెట్లో మంత్రులుగా కొనసాగనున్నారు.
మోదీ కేబినెట్లో ఈసారి.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హరియాణా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బీహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ, రాజీవ్ సింగ్, భూపేంద్ర యాదవ్, చిరాగ్ పాస్వాన్, సీఆర్ పాటిల్, ఇంద్రజిత్ సింగ్, ప్రతాప్ రావ్ గణపతి రావ్ జాదవ్, లలన్ సింగ్, జయంత్ చౌదరి, జితిన్ ప్రసాద్, శ్రీపద్ యసో నాయక్‌కి చోటు దక్కింది.
చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పిమ్మసాని.. మోదీ 3.0 కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. తెలంగాణ బీజేపీ కీలక నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కూడా మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.
బీజేపీ చరిత్రలో.. కేరళలో పార్టీకి తొలి సీటు అందించిన సురేశ్ గోపీ.. గెలుపుతో పాటు డైరక్ట్‌గా మోదీ 3.0 కేబినెట్లో చోటు దక్కించుకున్నారు.
మోదీ కేబినెట్లో ఇతర మంత్రులు..
పంకజ్ చౌదరి
కిషన్ పార్థ్
రామ్‌దాస్ అఠావలే
రామ్‌నాథ్ ఠాకూర్
నిత్యానంద్ రాయ్
అనుప్రియ పటేల్
వీ సోమన్న
ఎస్పీ సింగ్ భగేల్
శోభా కరంద్లాజే
కీర్తి వర్ధన్ సింగ్
పీఎల్ వర్మ
శాంతను ఠాకూర్
ఎల్ మురుగన్
అజయ్ టంటా
కమ్లేష్ పాస్వాన్
భగీరథ్ చౌదరి
సతీశ్ చంద్ర దూబే
సంజయ్ సేథ్
రవ్నీత్ సింగ్ బిట్టు
రక్ష నిఖిల్ ఖడ్సే
సావిత్రి ఠాకుర్
దుర్గా దాస్
సుకంత మజూందర్
థోకన్ సాహు
రాజ్ భూషణ్ చౌదరి
భూపతి రాజు
హర్ష్ మల్హోత్రా
నీముబెన్ భాంబనియా
మురళీధర్ మోహోల్
మోదీ 2.0లో కేంద్రమంత్రులుగా ఉన్న స్మృతీ ఇరానీ, అనురాగ్ ఠాకూర్ సహా పలువురికి మోదీ 3.0లో చోటు దక్కలేదు.