తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Flights Delayed : దిల్లీలో దట్టమైన పొగమంచు.. విమాన సేవలకు తీవ్ర అంతరాయం!

Flights delayed : దిల్లీలో దట్టమైన పొగమంచు.. విమాన సేవలకు తీవ్ర అంతరాయం!

Sharath Chitturi HT Telugu

23 December 2023, 11:09 IST

google News
    • Flights delayed in Delhi : దిల్లీని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఫలితంగా అనేక విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది.
దిల్లీలో దట్టమైన పొగమంచు.. విమాన సేవలకు తీవ్ర అంతరాయం!
దిల్లీలో దట్టమైన పొగమంచు.. విమాన సేవలకు తీవ్ర అంతరాయం!

దిల్లీలో దట్టమైన పొగమంచు.. విమాన సేవలకు తీవ్ర అంతరాయం!

Flights delayed in Delhi today : నిన్న, మొన్నటి వరకు వాయు నాణ్యత క్షీణత కారణంగా అల్లాడిపోయిన దిల్లీకి ఇప్పుడు మరో సమస్య వచ్చిపడంది. వాయు నాణ్యతతో పాటు దిల్లీ ప్రజలను పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరీ ముఖ్యంగా శనివారం ఉదయం పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారాయి. ఓవైపు చలికి ప్రజలు వణికిపోతుంటే.. పొగమంచు కారణంగా మరోవైపు దేశ, విదేశ విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

దిల్లీలో దట్టమైన పొగమంచు..

దిల్లీ విమానాశ్రయానికి సమీపంలో శనివారం ఉదయం ఉష్ణోగ్రత 14 డిగ్రీల కన్నా తక్కువగా ఉందని వాతావరణశాఖ వెల్లడింది. ఇక దట్టమైన పొగమంచు అలుముకోవడంతో 16 విమానాలు ఆలస్యమయ్యాయి. వీటిల్లో 11 అంతర్జాతీయ, 5 దేశీయ విమానాలు ఉన్నట్టు అధికారులు వివరించారు. విజిబులిటీ అతి తక్కువగా ఉండటంతో విమానాలు కదలడం లేదని స్పష్టం చేశారు. ఉదయం 7,8 గంటలకు కూడా పరిస్థితులు మెరుగుపడకపోవడం గమనార్హం.

Delhi temperature today : దిల్లీలో గత కొన్ని రోజులుగా.. రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. రోడ్ల మీద నివసించే వారు.. ఎయిమ్స్​లోని నైట్​ షెల్టర్స్​లో ఆశ్రయం పొందుతున్నారు. దిల్లీలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. చలి నుంచి విముక్తి కోసం చాలా ప్రాంతాల్లో కర్రలతో మంటలు పెట్టుకుని కూర్చుంటున్నారు.

"రోజు రోజుకు పరిస్థితులు కష్టంగా మారిపోతున్నాయి. చలి కారణంగా మార్నింగ్​ వాక్​ చేయడం కష్టమైపోతోంది. ఆఫీసులకు వెళ్లాలన్నా ఇబ్బందిగానే ఉంది. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు మాస్కులు వేసుకుంటున్నాము," అని ఓ దిల్లీవాసి పేర్కొన్నారు.

Delhi fog updates : వీటి మధ్య వాతావరణశాఖ కాస్త ఊరటనిచ్చే విషయం చెప్పింది. ఉత్తర భారతంలో.. రానున్న కొన్ని రోజుల్లో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 2-3 డిగ్రీల సెల్సియస్​ పెరుగుతుందని వివరించింది.

మరోవైపు.. దిల్లీలో పొగమంచు కారణంగా రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడిందా? లేదా? అన్న విషయంపై స్పష్టత రాలేదు.

ఇక దిల్లీ వాయు నాణ్యత విషయానికొస్తే.. ఏక్యూఐ (ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​) ఇప్పటికే అత్యంత తీవ్రంగానే ఉందని సీపీబీసీ (సెంట్రల్​ పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డ్​) చెబుతోంది. ప్రస్తుతం అక్కడి ఏక్యూఐ 447గా ఉంది.

తదుపరి వ్యాసం