తెలుగు న్యూస్ / ఫోటో /
‘మంచు కురిసే వేళలో’- జమ్ముకశ్మీర్‌లో ప్రకృతి అందాలు..!
- శీతాకాలంలో జమ్ముకశ్మీర్ అందాలపై మంచి కవితలే రాయొచ్చు. ఇక ఇప్పుడు.. ఆదివారం కురిసిన మంచుతో కశ్మీర్‌లోని గుల్మార్గ్ ప్రాంతం అందాలు రెట్టింపు అయ్యాయి. ఆ ఫొటోలను మీరూ చూసేయండి..
- శీతాకాలంలో జమ్ముకశ్మీర్ అందాలపై మంచి కవితలే రాయొచ్చు. ఇక ఇప్పుడు.. ఆదివారం కురిసిన మంచుతో కశ్మీర్‌లోని గుల్మార్గ్ ప్రాంతం అందాలు రెట్టింపు అయ్యాయి. ఆ ఫొటోలను మీరూ చూసేయండి..
(1 / 6)
జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్లో గత కొన్ని రోజులుగా మంచు కురుస్తోంది. ఫలితంగా అక్కడి ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీలకు పడిపోతున్నాయి.(ANI)
(2 / 6)
గుల్మార్గ్లో ఆరు ఇంచుల మేర మంచు పేరుకుపోయింది. పక్కనే ఉన్న సోన్మార్గ్లో కూడా ఇదే పరిస్థితి. శీతాకాలంలో ఇక్కడ ఇది సాధారణమైన విషయం.(ANI)
(3 / 6)
గుల్మార్గ్తో పాటు కర్నా, మాచిల్, గురేజ్, కుప్వారాలోని అనేక ప్రాంతాల్లో మంచు కురిసింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. సోమవారం నుంచి పరిస్థితులు మెరుగుపడతాయని వాతావరణశాఖ చెబుతోంది.(ANI)
(4 / 6)
శీతాకాలంలో జమ్ముకశ్మీర్ అందాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి ప్రజలు తరలివెళుతున్నారు. పర్యాటకులతో.. జమ్ముకశ్మీర్‌లోని అనేక ప్రాంతాలు కిటకిటలాడిపోతున్నాయి.(ANI)
(5 / 6)
జమ్ముకశ్మీర్ గుల్మార్గ్కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రజలు మంచులో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడపుతున్నారు.(ANI)
ఇతర గ్యాలరీలు